సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. మాదాపూర్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు పొడిగించనున్న మెట్రోరైలు నిర్మాణ పనుల శంకుస్థాపనలో భాగంగా.. రేపు (ఈనెల9)న సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లోని మాదాపూర్, నార్సింగి ఠాణాల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ టి.శ్రీనివాసరావు వెల్లడించారు.
బూడిద అంటే గతంలో అంతగా పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు బూడిద అక్రమార్కుల పాలిట కామధేనువుగా మారింది. ప్రజాప్రతినిధులు మాఫియాగా ఏర్పడి వందల లారీల ద్వారా కోట్లు కొల్లగొట్టేస్తున్నారు. రోజుకి లక్షల రూపాయల ఎన్టీపీసీ యాజమాన్యం సొమ్మును కొట్టేస్తున్నారు. రోజువారీ ఎవరి వాటా వారికి అప్పగిస్తూ తమ పని కానిచ్చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ బొగ్గు ఆధారిత ప్రాజెక్టులో బొగ్గును మండించిన తర్వాత వచ్చే బూడిద యాజమాన్యానికి పెద్ద తలనొప్పిగా మారింది.కుందనపల్లి గ్రామం వద్ద 1700…
చిన్న చిన్న దేశాల అవసరాలను తెలుసుకొని వాటికి సహాయం చేసి మెల్లిగా ఆ దేశంలో పాగా వేయడం డ్రాగన్ దేశానికి వెన్నతో పెట్టిన విద్య. గతంతో బ్రిటీష్ పాలకులు చేసిన విధంగానే ఇప్పుడు డ్రాగన్ పాలకులు చేస్తున్నారు. పాక్‌కు కావాల్సనంత డబ్బులు ఇచ్చి ఆ దేశాన్ని తన చెప్పుచేతల్లో పెట్టుకున్నది. ఇటు శ్రీలంకను సైతం అదేవిధంగా తన చెప్పుచేతల్లో పెట్టుకున్నది డ్రాగన్. కాగా ఇప్పుడు దృష్టిని కువైట్‌వైపు మళ్లించింది. కువైట్ ప్రస్తుతం అల్ షకయా ఎకనామిక్ సిటీని…
సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేసింది ఢిల్లీ హైకోర్టు.. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.. ఇది చాలా ముఖ్యమైన జాతీయ ప్రాజెక్టు అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో.. సెంట్రల్ విస్టా పనులను ఆపాలంటూ దాఖలైన పిల్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. ఇది ఉద్దేశపూర్వకంగా వేసిన పిటిషన్ తప్ప పిల్ కాదని పేర్కొంది.. అంతేకాదు పిటిషనర్లకు రూ.లక్షల జరిమానా కూడా విధించింది. సంబంధిత…