పోలీస్ మాన్యువల్‌కు విరుద్ధంగా ఆందోళనలు చేపట్టిన టీజీఎస్పీ కానిస్టేబుళ్లపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన వైఖరి అవలంభించింది. తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడుతున్న 10 మందిని గుర్తించి.. ఆర్టికల్ 311 ప్రకారం ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది. పదిమంది బెటాలియన్స్ కానిస్టేబుళ్లలను సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.