పంజాబ్‌లోని పాటియాలా నగరంలో ఓ కారు డ్రైవర్ చేసిన పని స్థానికులను భయాందోళనకు గురిచేసింది. రెగ్యులర్ విధుల్లో భాగంగా పాటియాలాలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో అటుగా వస్తున్న ఓ కారును కానిస్టేబుల్ ఆపే ప్రయత్నం చేశాడు. ఐతే కారు డ్రైవర్ ఆపకుండా కానిస్టేబుల్ మీదకు దూసుకొచ్చాడు. కానిస్టేబుల్ తప్పుకునేందుకు ప్రయత్నించినా అవకాశం ఇవ్వకుండా ఢీకొట్టి పారిపోయాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. తోటి పోలీసులు ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.…