సీఎం కెసిఆర్ కి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ రాశారు. గురుకుల పాఠాలల్లో ప్రవేశం లో 75% ప్రభుత్వ స్కూల్స్ లో చదివిన ఎస్సీ, ఎస్టీ మరియు బీసీ విద్యార్థులకు సీట్లు ఇవ్వాలని ఈ లేఖలో డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో ఉండే విద్యార్థులకు 50 శాతం సీట్లు కేటాయింపు మంచి నిర్ణయమని తెలిపారు. కానీ గురుకుల ప్రవేశ పరీక్ష విధానం తో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు నష్టపోతున్నారని… ప్రైవేటు స్కూల్ లో చదివి పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు పోటీ పడలేక పోతున్నారని సూచించారు జీవన్ రెడ్డి. దీనిపై సీఎం కేసీఆర్ సానుకూలమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.