కర్ణాటకలో రాజకీయాలో మరోసారి రచ్చ చేస్తున్నాయి. రెండేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయిన తరువాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. అయితే, కాంగ్రెస్ నుంచి పలువులు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడంతో సంకీర్ణప్రభుత్వం కూలిపోయింది. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిని రెండేళ్ల తరువాత కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఎమ్మెల్యే శ్రీమంత్ బాలాసాహెబ్ పటెల్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పార్టీ మారేందుకు బీజేపీ పెద్ద ఎత్తున డబ్బులు ఇవ్వజూపారని, కానీ తాను వాటిని…
ఇతర పార్టీలన్నీ జనాల్లో దూసుకుపోతుంటే.. రాబోయే ఎన్నికలకు ఇప్పటినుంచే కసరత్తు చేస్తుంటే.. కాంగ్రెస్ నేతలు మాత్రం రోజు రోజుకూ డీలా పడిపోతున్నారు. సోనియాగాంధీకి వయోభారం.. ఆమె స్థాయిలో పార్టీని రాహుల్ నడిపించడానికి ముందుకు రాకపోతుండడం.. ఇతర సీనియర్లు సైతం పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ఆసక్తి చూపని వైనం.. ఈ కారణాలతో పార్టీ శ్రేణుల్లో రోజురోజుకీ ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతోంది. వాస్తవానికి కాంగ్రెస్ కు బలమైన ప్రజామద్దతు ఇప్పటికీ ఉంది. బీసీలు, మైనారిటీలు చాలా ప్రాంతాల్లో నేటికీ ఆ పార్టీని…
వచ్చే ఏడాది ఉత్తర ప్రదేశ్కు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్నిపార్టీలు సమాయాత్తం అవుతున్నాయి. అమ్ములపొదిలోని అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. యోగీ నేతృత్వంలోనే 2022 ఎన్నికలకు సిద్ధమవుతుండగా, కాంగ్రెస్ పార్టీ కొత్త తరం నేతలతో దూకుడు పెంచేందుకు సిద్ధం అవుతున్నది. ఇప్పటి వరకు ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయని ప్రియాంకా గాంధీ మొదటిసారి యూపి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ఆమెను యూపి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించే అవకాశం ఉన్నది. ఇప్పటికే ఆమె అభ్యర్థిత్వం ఖరారైనట్టు…
సార్వత్రిక ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉన్నప్పటికీ తెలంగాణలో మాత్రం పోలికల్ వార్ నడుస్తోంది. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటి నుంచే సన్నాహాలు చేసుకుంటున్నాయి. దీనిలో భాగంగా గత కొంతకాలంగా ర్యాలీలు, సభలు, సమావేశాలు, పాదయాత్రలతో ఈ రెండు పార్టీలు తెగ హడావుడి చేస్తున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయంగా నిలిచేందుకు ఈ పార్టీలు జనసమీకరణపై దృష్టి పెట్టడం ఆసక్తి రేపుతోంది. మరోవైపు ఈ రెండు పార్టీలు సెప్టెంబర్…
తెలంగాణ కాంగ్రెస్ ని ఆమె ఇరుకున పెట్టేశారా..? హుజూరాబాద్ అభ్యర్థి కోసం వెతుకుతున్న సమయంలో… ఆ మహిళా నేత కామెంట్స్ పార్టీని మరింత గందరగోళం లోకి నెట్టాయా..? ఇప్పుడు హుజూరాబాద్, తర్వాత వరంగల్ అంటున్నారట. ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ ఏదో అనుకుంటే మరేదో జరిగిందా? తెలంగాణ కాంగ్రెస్ హుజూరాబాద్ అభ్యర్ధి ఎంపిక పై పెద్దగా తర్జనభర్జనలు పడలేదు. కానీ, బలమైన అభ్యర్దిని బరిలోకి దించే ప్రయత్నం చేసింది. అందులో భాగంగా నే బీసీ సామాజిక వర్గం…
గతంలో ఎన్నడూ లేనివిధంగా కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. గత రెండు పర్యాయాలు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడంతో ఆ ప్రభావం క్రమంగా అన్ని రాష్ట్రాలపై పడింది. దీంతో కాంగ్రెస్ క్రమంగా ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతూ వస్తుంది. ఇదే సమయంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి చావోరేవో అన్నట్లుగా మారింది. దీంతో ఈ ఎన్నికలను కాంగ్రెస్ సైతం ఛాలెంజ్ తీసుకుని పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది. ఈ ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు…
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా దెబ్బతిన్నది. 2017 లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 325 సీట్లు గెలుచుకున్నది. అయితే, ఈసారి ఆ పార్టీకి కొంత ఎదురుగాలి విస్తుండడంతో, దానిని తనవైపు తిప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధం అవుతున్నది. ఇందులో భాగంగా ఆ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ ప్రతిజ్ఞ యాత్ర పేరుతో యాత్ర చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయాత్తం అవుతున్నది.…
జమ్మూకాశ్మీర్ పర్యటనలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. జమ్మూకశ్మీర్తో మా కుటుంబానికి అనుబంధం ఉందన్న ఆయన.. తమ కుటుంబీకులు కూడా కశ్మీరీ పండిట్లేనని చెప్పారు.. ఇక్కడికి వచ్చి వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించినప్పుడు తన సొంతింటికి వచ్చినట్లు అనిపించిందన్నారు. ఇక, కొందరు కశ్మీరి పండిట్లు రాహుల్ గాంధీని కలిశారు. అయితే, వారి కోసం ఎన్నో పథకాలను కాంగ్రెస్ ప్రవేశపెట్టిందని రాహుల్ గాంధీ. కశ్మీరీ పండిట్ సోదరులకు తన వంతు ఏదైనా సాయం చేస్తానని చెప్పారు.…
వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పరిస్థితి ప్రస్తుతం మహాసంద్రంలో నావలా తయారైంది. మోదీ హవాను తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండుసార్లు కేంద్రంలో అధికారానికి దూరమైంది. ఈ ప్రభావం రాష్ట్రాలపై పడటంతో కాంగ్రెస్ క్రమంగా గత వైభవాన్ని కోల్పోతూ వస్తోంది. కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కు ఉన్న సోనియాగాంధీకి వయస్సు పైబడటం, అనారోగ్య కారణాలతో ఆ బాధ్యతను తన కుమారుడు రాహుల్ గాంధీకి అప్పగించే ప్రయత్నం చేశారు. ఒకసారి కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీ గత…