తెలంగాణలో స్థానిక, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడులైన విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంల నేడు నామినేషన్లకు చివరి రోజు. ఇప్పటికే టీఆర్‌ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించింది. కానీ కాంగ్రెస్ దుబ్బాక, జీహెచ్‌ఎంసీ, హుజురాబాద్ ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలా.. వద్దా..? అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్య నేతలతో సమావేశమయ్యారు.
ఈ మేరకు 12 స్థానాల్లో బలం అధికంగా ఉన్న స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను కాంగ్రెస్ తరుపున బరిలోకి దించుతోంది. ఈ క్రమంలో ఖమ్మం నుంచి ఎమ్మెల్సీ స్థానానికి రాయల్ నాగేశ్వర్‌రావుకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బీ ఫామ్ అందజేశారు. అంతేకాకుండా మెదక్‌లో నిర్మలా జగ్గారెడ్డికి కాంగ్రెస్ భీ ఫామ్ దక్కింది. అయితే నల్గొండలో మాత్రం కాంగ్రెస్ అయోమయంలో ఉంది. ఎందుకంటే.. ఎంపీ కోమటిరెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్‌ల మధ్య ఇంకా సయోధ్య కూడకపోవడంత ఆ స్థానంపై ఇంకా స్పష్టత రాలేదు.