ఝలావర్‌లో జరిగిన భారత్ జోడో యాత్ర కార్యక్రమంలో ఇద్దరు కాంగ్రెస్ నేతలు వేదికపై రాహుల్ గాంధీతో కలిసి గిరిజన నృత్యంలో పాల్గొనడానికి చేతులు జోడించి నృత్యం చేశారు. ఒకే వేదికపై సీనియర్ నేతలైన రాహుల్ గాంధీ ,అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్, కమల్ నాథ్‌లు స్టెప్పులు వేయడం గమనార్హం.
Congress Steering Panel Holds First Meeting: కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ స్టీరింగ్ కమిటీ తొలి సమావేశం ఆదివారం ప్రారంభం అయింది. ఖర్గేతో పాటు సోనియాగాంధీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్,నియర్ నేతలు పి చిదంబరం, ఆనంద్ శర్మ, మీరా కుమార్, అంబికా సోనీ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆదివారం సాయంత్రం మధ్యప్రదేశ్ నుంచి రాజస్థాన్ లోకి భారత్ జోడో యాత్ర ప్రవేశిస్తున్న…
Delhi Civic Polls Today: బీజేపీ, ఆప్, కాంగ్రెస్ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఈ రోజు జరగనున్నాయి. ఇప్పటికే పోలింగ్ కోసం అంతా సిద్ధం అయింది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం సాయంత్రం 5.30 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 250 వార్డులకు 1349 మంది పోటీలో నిలబడ్డారు. 1.5 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ నేతృత్వంలో చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్‌లోని బర్వానీ జిల్లాలో రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్రకు హాజరైనందుకు పాఠశాల ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు శనివారం ఒక అధికారి తెలిపారు.
మధ్యప్రదేశ్‌లో రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్రలో కంప్యూటర్ బాబా పాల్గొన్నారు. ఈ ఉదయం మధ్యప్రదేశ్‌లోని మహుదియా నుంచి కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర తిరిగి ప్రారంభమైంది. ఈరోజు జరిగిన మెగా పాదయాత్రలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కమల్ నాథ్, అలాగే కంప్యూటర్ బాబాగా ప్రసిద్ధి చెందిన నామ్‌దేవ్ దాస్ త్యాగి కూడా పాల్గొన్నారు.
రేవంత్‌రెడ్డి దిగిపోయిన తర్వాత తానే పీసీసీ అధ్యక్షుడిని అవుతానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. అసెంబ్లీ అవరణలో రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డి ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా వారిద్దరిమధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది.