Parliament Budget Session: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. జనవరి 31 నుంచకి ఏప్రిల్ 6 వరకు పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ జరగబోతున్నాయి. 27 సమావేశాలు, 66 రోజుల పాటు జరుగుతాయిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోెషి తెలిపారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో రాజ్యసభ, లోక్ సభ సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయి. రాష్ట్రపతి ప్రసంగం, కేంద్ర బడ్జెట్ , ఇతర అంశాలపై…
Komatireddy Venkat Reddy: తెలంగాణ కాంగ్రెస్ నూతన ఇంఛార్జీ మాణిక్ రావ్ థాక్రే తో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ ముగిసింది. హైద్రాబాద్ హైదర్ గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉన్న థాక్రేతో సమావేశమైన కోమటిరెడ్డి మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించదని చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తనకిచ్చిన AICC షోకాజ్ నోటీసులు ఎప్పుడో చెత్తబుట్టలో పడ్డాయని సంచలన వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి. పీసీసీ కమిటీలను నేను పట్టించుకోనని అన్నారు.…
BJP spreading hatred, Rahul Gandhi criticizes BJP: భారత్ జోడో యాత్రలో మరోసారి బీజేపీపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. బుధవారం ఉదయం ఆయన గురుద్వారా ఫతేగఢ్ సాహిబ్ వద్ద ప్రార్థనలు నిర్వహించారు. అక్కడే జరిగిన ర్యాలీలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. బీజేపీ ప్రజల మధ్య ద్వేషాన్ని పెంచుతోందని విమర్శించారు. అయితే భారతదేశం సోదరభావం, ఐక్యత, గౌరవంతో కూడిందని అందుకే యాత్ర విజయవంతం అయిందని ఆయచన అన్నారు. భారత్ జోడో యాత్ర నుంచి…
UP Minister criticizes Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’లో బీజేపీని, ఆర్ఎస్ఎస్ ను తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. తాజాగా రాహుల్ గాంధీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)ని 21 శతాబ్ధపు కౌరవులతో పోలుస్తూ విమర్శించారు. అయితే ఈ విమర్శలపై బీజేపీ కూడా ఘాటుగానే స్పందిస్తోంది. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ మంత్రి దినేష్ ప్రతాప్ సింగ్ రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. పాండువులు తమ సోదరిని ముద్దు పెట్టుకుంటారా.? అని ప్రశ్నించారు. ఇటీవల ఓ…
కర్ణాటకలో ఎన్నికల వేడి మొదలైంది. 2023 ఎన్నికలే లక్ష్యంగా కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. అధికారంలోని బీజేపీని గద్దె దించాలని నిర్ణయించుకుని బస్సు యాత్రను ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించనుంది. రేపు బెలగావిలో అధికారికంగా ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.
Himachal cabinet expansion sparks dissent in Congress: చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. అధికారంలో ఉన్న బీజేపీని ఓడించింది. గెలుపొందిన సంతోషంలో ఉన్న కాంగ్రెస్ లో లుకలుకలు కనిసిస్తున్నాయి. తాజాగా హిమాచల్ ప్రదేశ్ క్యాబినెట్ విస్తరణ పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో అసంతృప్తిని రాజేసింది. కాంగ్రా ఎమ్మెల్యే సుధీర్ శర్మ, ఘరావిన్ ఎమ్మెల్యే రాజేష్ ధర్మాని అధిష్టానంపై బహిరంగంగానే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు…