*ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ జరగనుంది. పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.
*ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ దాఖలు చేసిన చార్జీ షీట్‌పై రౌస్ ఏవిన్యూ కోర్టులో విచారణ జరగనుంది. లిక్కర్ స్కాంలో ఈడీ సప్లిమెంటరీ చార్జిషీట్‌ను నేడు పరిగణనలోకి తీసుకునే విషయంపై స్పెషల్ కోర్ట్ ఆర్డర్ ఇవ్వనుంది.
*నేటి నుంచి షర్మిల ప్రజాప్రస్థానం యాత్ర ప్రారంభం.. గవర్నర్ తమిళిసైని కలవనున్న షర్మిల
*నేటి నుంచి సమతాకుంభ్ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం శ్రీరామనగరంలోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రాంగణంలో ఈ నెల 2 నుంచి 14 వరకు సమతా కుంభ్-2023 బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించడానికి సర్వం సిద్ధం చేసినట్లు జీవా ప్రతినిధులు పేర్కొన్నారు.
*ఇవాళ మహారాష్ట్రకు వెళ్లనున్న తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
*నేడు మహానంది క్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించనున్న శ్రీశైలం ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి
*మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో నేడు స్వామి వారి మూలబృందావనంకు తుంగ జలంతో సంప్రోక్షణ, తులసి అర్చన, కనకాభిషేకం, పాలాభిషకం, పంచామృతాభిషకం వంటి విశేష పూజలు.
*అనంతపురం నగరంలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో జగనన్న కాలనీల లబ్ధిదారులతో రౌండ్ టేబుల్ సమావేశం .
*అనంతపురం నగరంలోని కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో స్థిరమ్తెన అభివృద్ధి లక్ష్యాలప్తె సమీక్షా సమావేశం. పాల్గొననున్న మాజీ సీఎస్ సమీర్ శర్మ.
*కృష్ణా జలాల నుండి పూర్తిగా బయటపడిన సంఘమేశ్వరాలయం.. నేటి నుండి భక్తులకు దర్శనం ఇవ్వనున్న వేపదారు శివలింగం.