Rahul Gandhi: రాహుల్ గాంధీ ప్రస్తుతం దేశరాజకీయాల్లో వినిపిస్తున్న పేరు. ఆయనకు క్రిమినల్ పరువునష్టం కేసులో రెండేళ్లు జైలు శిక్ష విధించింది సూరత్ కోర్టు. అయితే అతడికి పై కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు 30 రోజుల బెయిల్ మంజూరు చేశారు న్యాయమూర్తి. ఈ శిక్ష ఏకంగా రాహుల్ గాంధీ ఎంపీ పదవి పోయేలా చేసింది. శిక్ష పడిన వెంటనే పార్లమెంటరీ సెక్రటరీ రాహుల్ గాంధీపై లోక్ సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేస్తూ నోటిఫికేషన్ జారీ అయింది.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన తర్వాత దేశ రాజకీయాలు వేడెక్కాయి. ఓవైపు కేంద్రాన్ని టార్గెట్ చేస్తూనే మరోవైపు రాహుల్ గాంధీకి మద్దతు ఇస్తున్నారు. విపక్షాలు ఏకం అవుతున్నట్లు తెలుస్తోంది.
క్రిమినల్ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ దోషిగా తేలడం, ఆయనపై వెంటనే అనర్హత వేటు పడడం.. 2013లో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేస్తోంది. 2013లో సెప్టెంబర్లో రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో ఓ ఆర్డినెన్స్ కాపీని చించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
పార్లమెంటు సభ్యునిగా అనర్హత వేటు పడిన తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. తాను భారత్ స్వరం కోసం పోరాడుతున్నానని.. ఎంతవరకైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని అవమానించేలా చేసిన వ్యాఖ్యకు పరువునష్టం కేసులో దోషిగా తేలిన ఒక రోజు రాహుల్పై అనర్హత వేటు పడడం గమనార్హం.