Divya Spandana: నాకు తల్లిదండ్రుల తర్వాత రాహుల్ గాంధీయే.. కన్నడ నటి కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kannada Actor Divya Spandana: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురించి లోక్‌సభ మాజీ సభ్యురాలు, కన్నడ నటి దివ్య స్పందన అలియాస్ రమ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో రాహుల్‌ను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. కన్నడ టాక్ షో వీకెండ్ విత్ రమేష్ సీజన్ 5 ఎపిసోడ్‌లో కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా దివ్య స్పందన తన తండ్రిని కోల్పోవడం గురించి మాట్లాడారు. ఆమె జీవితంలో ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పారు. తనకు తన తల్లిదండ్రులే ప్రాణమని.. తండ్రి చనిపోయిన రెండు వారాలకే పార్లమెంట్‌లో అడుగుపెట్టాల్సి వచ్చిందని.. ఈ నేపథ్యంలో పార్లమెంట్ కార్యకలాపాల గురించి తన కొత్త అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఏమీ తెలియనప్పటికీ ప్రతీదీ నేర్చుకున్నానని ఆమె తెలిపారు. బాధను పనివైపు మళ్లించానని.. అంతటి శక్తిని మాండ్యా ప్రజలే ఇచ్చారని దివ్య స్పందని వెల్లడించారు.
ఇదిలా ఉండగా.. జీవితంలో తనను ఎక్కువ ప్రభావితం చేసిన వ్యక్తుల్లో అమ్మానాన్నల తర్వాత రాహుల్ గాంధీయే ఉంటారన్నారు. నాన్న మరణంతో తీవ్ర దుఃఖంలో ఉండి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని.. మరోవైపు ఎన్నికల్లో ఓడిపోయానని.. అలాంటి కష్ట సమయంలో రాహుల్ గాంధీ తనకు అండగా నిలబడి సహాయం చేశారన్నారు. మానసికంగా ధైర్యం నూరిపోసి సపోర్ట్ చేశారని చెప్పుకొచ్చారు.
Also Read
- 5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
- ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
Read Also: G20 delegates: ఆస్కార్ మేనియా.. ‘నాటు నాటు’ పాటకు G20 ప్రతినిధుల స్టెప్పులు
దివ్య స్పందన 2012లో యువజన కాంగ్రెస్‌లో చేరారు. ఆమె 2013 ఉప ఎన్నికల్లో కర్ణాటకలోని మాండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయారు. కాంగ్రెస్ సోషల్ మీడియా హెడ్‌గా పనిచేసిన ఆమె ఆ తర్వాత ఆ పదవికి రాజీనామా చేశారు. గత సంవత్సరం, ఆమె చిత్ర పరిశ్రమకు తిరిగి వస్తున్నట్లు ప్రకటించింది. తన సొంత ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించింది. “మీలో చాలామంది ఊహించినది నిజమే – నేను మళ్లీ సినిమాలు చేయబోతున్నాను!! అయితే ఈసారి నేను నా బోటిక్ ప్రొడక్షన్ హౌస్ యాపిల్ బాక్స్ స్టూడియోస్ ద్వారా కూడా సినిమాలను నిర్మిస్తాను” అని నటి దివ్య స్పందన ఒక ప్రకటనలో తెలిపారు.
తాజావార్తలు
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..