సింగరేణిని ప్రైవేట్ పరం చేసే దుర్మార్గపు కుట్ర రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. స్టీల్ ప్లాంట్ పెట్టే శక్తి ఉంటే బయ్యారంలో పెట్టు.. విశాఖ వద్దు బయ్యారం ముద్దు అని ఆయన అన్నారు.
కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ ఈరోజు జైపూర్లో తన సొంత ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని తన నిరసన నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. పార్టీ వ్యతిరేక చర్యకు దిగొద్దని హైకమాండ్ హెచ్చరించినా.. కాంగ్రెస్ పెద్దల ఆదేశాలన్ని పైలట్ ధిక్కరించారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు బీజేపీలో చేరిక రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తీవ్ర విమర్శలు చేశారు. ఆయనను అదానీ వరుసతో ముడిపెట్టినందుకు ట్రోల్ మారారని అని పేర్కొన్నారు.
దేశంలో లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. 2024 ఏప్రిల్ లేదా మే లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో ప్రధాన పార్టీలు ఇప్పుటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నాయి. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ.. ఈసారి మోదీ సర్కార్ కు గద్దె దించాలని ప్రతిపక్షాలు పట్టుదలతో ఉన్నాయి.
Karnataka Elections: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఈ రోజు బీజేపీ పెద్దలు ఢిల్లీలో సమావేశం కానున్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పార్టీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు సమావేశం కానున్నట్లు సమాచారం. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు నళిన్కుమార్ కటీల్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్…
Amul vs Nandini: కర్ణాటకలో ఎన్నికల ముంచుకొస్తున్న వేళ సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఆ రాష్ట్రంలో పాల వివాదం చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్షాలు కాంగ్రెస్, జేడీయూ పార్టీలు అధికార బీజేపీని ఇరకాలంలో పడేశాయి. రాష్ట్రంలోకి గుజరాత్ డెయిరీ దిగ్గజం అమూల్ ఎంట్రీ ఇవ్వడాన్ని అక్కడి ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. రాష్ట్రంలోని రైతులకు నష్టం చేకూరేలా నందిని మిల్క్ ను దెబ్బతీసేలా బీజేపీ చేస్తోందంటూ విమర్శలు వస్తున్నాయి.
Kiren Rijiju: 2019 క్రిమినల్ పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిన న్యాయమూర్తి నాలుక నరికివేస్తానని తమిళనాడులోని కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు బెదిరించడంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా శనివారం ఆయన విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నిరాశాలో ఉందని, న్యాయవ్యవస్థపై దాడి చేస్తోందని అన్నారు. కానీ ఇలాంటి వాటిపై ప్రభుత్వం సైలెంట్ గా ఉండదని వార్నింగ్ ఇచ్చారు.