ఇటీవల బీజేపీ నేత, మాజీ సీఎం వసుంధర రాజే అవినీతిపై చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రస్తావిస్తూ సచిన్ పైలెట్ దీక్ష చేపట్టారు. దీంతో అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్ల మధ్య మరోసారి విభేదాలు బయటకు వచ్చాయి. ఈ సమస్యను సద్దుమణిగేలా చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తోంది.
కర్ణాటకలో ఎన్నికల వేళ అధికార బీజేపీకి రెబెల్స్ తో తలనొప్పిగా మారింది. మే 10న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీలో చాలా మంది అభ్యర్థులు ఉండటంతో గందరగోళం నెలకొంది.
నర్హత వేటుకు గురైన కారణంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను శుక్రవారం ఖాళీ చేశారు. లోక్సభ హౌజింగ్ కమిటీ ఇచ్చిన నోటీసు కారణంగా ఆయన నేడు బంగ్లాను ఖాళీ చేశారు. తన సామాన్లను ట్రక్కులో తరలించారు.
ఆయనకు 45 ఏళ్లు. ఇంకా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటున్నారు. కానీ రాంపూర్ మున్సిపల్ సీటును మహిళలకు రిజర్వ్ చేయాలనే నిర్ణయం దాని ప్రస్తుత అధ్యక్షుడు మామున్ ఖాన్ తన కోసం వధువును వెతుక్కునేలా చేసింది.
కర్ణాటకలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ అధికార బీజేపీలో అసంతృప్తుల సంఖ్య పెరుగుతోంది. టికెట్లుపై ఆశ పడి భంగపడిన నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సవాది బీజేపీని వీడారు.
రాజస్థాన్లోని అధికార కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం కొనసాగుతోంది. సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య వార్ పతాక స్థాయికి చేరింది. సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సచిన్ పైలట్ చేసిన నిరాహార దీక్షతో గెహ్లాట్ ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందిగా మారింది.
వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశంలోని విపక్ష పార్టీలు ఏకం అవుతున్నాయి. ఈ క్రమంలో బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలను కలిసిన సంగతి తెలిసిందే.