CR Kesavan: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, భారత చివరి గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి ముని మనవడు సిఆర్ కేశవన్ శనివారం బిజెపిలో చేరారు. దక్షిణాదిలో మరింగా విస్తరించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే దక్షిణాదికి చెందిన ముఖ్యనేతలను పార్టీలో చేర్చుకుంటోంది. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న కేశవన్ బీజేపీలో చేరడం చర్చనీయాంశంగా మారింది. ఈ చేరికతో కాంగ్రెస్కు మరో షాక్ తగిలినట్లు అయింది. కేంద్ర మంత్రి వీకే సింగ్, బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి…
2019 క్రిమినల్ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిన న్యాయమూర్తి నాలుకను కోసేస్తానని తమిళనాడులోని కాంగ్రెస్ నాయకుడు మణికందన్ బెదిరించాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ న్యాయమూర్తి నాలుకను కోసేస్తానని బెదిరించగా.. ఆయన చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైంది.
Kiran Kumar Reddy: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు.. పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన.. ప్రజాప్రతినిధిగా కూడా సేవలు అందించారు.. అయితే, వైఎస్ రాజశేఖర్రెడ్డి కన్నుమూసిన తర్వాత.. ఆయనకు సీఎం అవకాశం కూడా వచ్చింది.. ఆయన సీఎంగా ఉన్న సమయంలో.. తెలంగాణ ఉద్యమం ఓవైపు.. సమైక్యాంధ్ర ఉద్యమం మరోవైపు ఉధృతంగా సాగాయి.. అయితే, కాంగ్రెస్ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో మొత్తంగా.. రాష్ట్రం…
అదానీ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. ఇటీవల జరిగి పార్లమెంట్ సమావేశాల్లో అదానీ వ్యవహారం కుదిపేసింది. బడ్జెట్ సమావేశాలు మొత్తం అదానీ వ్యవహరంపైనే చర్చించాలని ప్రతిపక్ష కాంగ్రెస్ పట్టుబట్టిన సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఆధారంగా రాహుల్ గాంధీ లోక్సభకు అనర్హత వేటు వేయడంపై పార్లమెంటు కార్యకలాపాలకు అంతరాయం కలిగించిన ప్రతిపక్షాలను ప్రజలు క్షమించరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పేర్కొన్నారు. కౌశాంబి మహోత్సవ్ను ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. సమాజంలోని అన్ని వర్గాల సర్వతోముఖ సంక్షేమం కోసం 2024లో మరోసారి నరేంద్ర మోదీని ప్రధానిగా ఎన్నుకోవాలని ప్రజలను కోరారు.
బీజేపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీపై ఆయన సోదరుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడి నిర్ణయం షాక్ కు గురి చేసిందని ఎకె ఆంటోనీ చిన్న కుమారుడు అజిత్ అన్నారు. కాషాయ పార్టీ అతన్ని తాత్కాలికంగా ఉపయోగించుకున్న తర్వాత కరివేపాకు లాగా విసిరివేస్తుందని అన్నారు.