రేపు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తొలి సారి వరంగల్ జిల్లాకు వస్తుండటంతో తెలంగాణ బీజేపీ నేతలు ప్రధాన పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇక ఇదే క్రమంలో జనగామ జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి ప్రధాని పర్యటన పై మీడియా సమావేశం నిర్వహించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్ట మొదటి సారిగా వరంగల్ కు వస్తున్న ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ అని ఆయన అన్నారు.
Read Also: Karnataka Budget 2023: బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సిద్ధరామయ్య.. ఎక్సైజ్ సుంకం భారీగా పెంపు
దేశంలో సిద్ధాంతాలు, లక్ష్యాలు ఉన్న పార్టీ బీజేపీ మాత్రమే అని మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. దేశంలో ఉచిత కోవిడ్ వాక్సిన్ అందించిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతుందని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో ఎవరికి ఉపయోగం కలగలేదు.. ఆర్టికల్ 370ని రద్దు చేసి దేశాన్ని కాపాడిన ఘనత బీజేపీ పార్టీది.. రేపు జరగబోయే ప్రధాని పర్యటన విజయవంతం అవుతుందని అన్నాడు.
Read Also: Extramarital Affair : భర్తకు ప్రేమగా మటన్ బిర్యానీ పెట్టిన భార్య.. ట్విస్ట్ ఏంటంటే?
తెలంగాణ బీజేపీతోనే సాధ్యం అయ్యింది.. కాంగ్రెస్ కు లక్ష్యాలు సిద్ధాంతాలు లేవు.. కాళేశ్వరం, సెక్రటేరియట్, కట్టించి అభివృద్ది చేసినని చెపుతున్న సీఎం కేసీఆర్ వాటి ప్రచారాలకే వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు అని కొండ విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. అసలు ఆభివృద్ధి అది కాదు.. విద్య వైద్యం అభివృద్ధి కావాలి.. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా తెలంగాణ అభివృద్ధికి ప్రధాని రూ. 6000 కోట్ల అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు.. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనను విజయవంతం చేయాలి అని కొండ విశ్వేశ్వర్ రెడ్డి తెలిపాడు.