ఏపీలో పార్టీ విషయంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉనికే లేని ఏపీలో మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డికి కీలకమైన సీడబ్ల్యూసీలో స్థానం కల్పించారు. తెలంగాణకు ప్రత్యేక ఆహ్వానితుల కోటాలో ఇద్దరికి చోటు కనిపించిన ఏఐసీసీ అధిష్టానం.. ఏపీకి మాత్రం సీడబ్ల్యూసీలో శాశ్వత సభ్యత్వాన్ని రఘువీరారెడ్డికి ఇచ్చింది.
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీ మార్పుపై గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనిపై తాజాగా జగ్గారెడ్డి స్పందించారు. గత ఏడాదిన్నర నుంచి సోషల్ మీడియా ఆనందం ఏందో మరి అర్థం కావడం లేదు.. ఎవరు చేయిస్తున్నారు.. ఎందుకు రాస్తున్నారో అర్థం కావడం లేదని ఆయన వ్యాఖ్యనించారు.
కాంగ్రెస్, బీజేపీ వాళ్లకు బీ-ఫార్మ్ కావాలంటే ఢిల్లీకి పోవాలి.. ఢిల్లీ గులాంలకు.. తెలంగాణ ఆత్మ గౌరవం మధ్య ఎన్నికలు జరుగనున్నాయని కేటీఆర్ కామెంట్స్ చేశాడు. బీజేపీ మతం మంటలు పెడుతుంది.. కేసీఆర్ ను జైలుకు పంపుతానని విమర్శించిన వ్యక్తినే ఇప్పుడు షెడ్డుకు పోయిండు అంటూ కేటీఆర్ సెటైర్ వేశాడు.
రాష్ట్రంలో ఎవరెన్ని ట్రిక్కులు చేసిన హ్యాట్రిక్ మాత్రం కేసీఆర్ దే అని మంత్రి హరీష్ రావు అన్నారు. గత ఎన్నికల్లో కంటే ఎక్కువగా సీట్లు గెలుస్తాం.. కుర్చీ కోసం కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కొట్టుకుంటున్నాయి.. ప్రతి పక్షాలది తిట్లలో పోటీ.. బీఆర్ఎస్ కి దేశంలో తెలంగాణని నంబర్ వన్ స్థానంలో నిలపడంలో పోటీ.. ఈ నెల23న సీఎం కేసీఆర్ మెదక్ జిల్లాలో పర్యటించబోతున్నారు అని ఈ సందర్భంగా మంత్రి చెప్పుకొచ్చారు.
ఆగస్టు 20న తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జన్మదిన వేడుకలను జరుపుకోనున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శనివారం లడఖ్లోని పాంగాంగ్ సరస్సు వద్దకు బైక్పై వెళ్లారు.
కర్ణాటక ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ దేశంలో దూసుకెళ్తోంది. అధికార బీజేపీపై అవినీతి ఆరోపణలు చేస్తూ ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. మధ్యప్రదేశ్లో కూడా కర్ణాటక తరహాలోనే అదే ఫార్ములాను ఉపయోగించాలని ప్రయత్నిస్తోంది.
పెరుగుతున్న ఆహార పదార్థాల ధరలతో కష్టాల్లో కూరుకుపోయిన కూరగాయల వ్యాపారికి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తన చేతులతో భోజనం వడ్డించారు. ఇటీవల ఢిల్లీలోని ఆజాద్ పూర్ మండీలో పెద్దసంఖ్యలో టమాటాలు కొనేందుకు వచ్చిన రామేశ్వర్... అక్కడి ధరలు చూసి టమాటాలు కొనలేకపోయాడు. టమాటాల ధరలు చూసి అతడు కన్నీటి పర్యంతమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
2023 ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్న నేను సంవత్సరం పాటు ఎమ్మెల్సీగా ఉంటాను మీకు అండగా ఉండి మీ ఉద్యోగాలు క్రమబద్దికరించే బాధ్యత నాది అంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు. రాజకీయాల నుంచి తాను అంత ఈజీగా పోయేటోడిని కాదని అన్నారు.
దేశంలో సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో దేశ రాజకీయాలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ 2024 లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని మళ్లీ అమేథీ నుంచి పోటీ చేస్తారని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి కొత్తగా నియమించబడిన అధ్యక్షుడు అజయ్ రాయ్ శుక్రవారం ధృవీకరించారు.