Raghuveera Reddy: సీడబ్ల్యూసీ మెంబర్‌గా ఎంపికయ్యాక తొలిసారి మడకశిర వెళ్లిన మాజీ మంత్రి ఎన్.రఘువీరారెడ్డికి ఘనస్వాగతం లభించింది. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు రఘువీరారెడ్డికి సాదర స్వాగతం పలికారు. బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్‌లో కీలక పదవి దక్కించుకున్న రఘువీరారెడ్డికి అభినందనలు తెలిపారు. ఇక, ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. కాంగ్రెస్‌లో కీలక పదవి లభిస్తుందని తాను ఊహించలేదన్నారు సీడబ్ల్యూసీ మెంబర్‌గా ఎంపికైన రఘువీరారెడ్డి. నాలుగేళ్లుగా స్వగ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్న తనకు పార్టీ పెద్ద బాధ్యత అప్పగించడం సంతోషంగా ఉందన్నారాయన. పార్టీని మరింతగా బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషిచేస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశా.. నా సేవలు మరింత విస్తృతం చేస్తా అన్నారు.. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పార్టీ పెద్దలందరినీ కలుపుకొని ముందుకెళ్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ, కార్యకర్తల అభిప్రాయం మేరకే రాజకీయం చేస్తానని ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను గుర్తించి వాటిని కలుపు పోయే విధంగా అధిష్టానానికి సలహాలు ఇస్తా.. నా గ్రామం నుండి దేశవ్యాప్తంగా అభివృద్ధి కోసం కృషి చేస్తానని ప్రకటించారు రఘువీరారెడ్డి.
Read Also: Bhatti Vikramarka: దళిత గిరిజనులు ఆత్మగౌరవంతో బతకాలంటే కాంగ్రెస్ పాలనలోనే సాధ్యం