బీజేపీ శ్రేణులు మాత్రం ఆశించిన స్థాయిలో యాక్టివ్ గా పనిచేయడం లేదు అని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బీజేపీ గొంతుకగా మారి ప్రజల పక్షాన పోరాడాలి.. ప్రతి బీజేపీ కార్యకర్తలో మోడీ ఆవహించాలి.. బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేదాకా పోరాడాలి అని బండి సంజయ్ పిలుపునిచ్చారు.
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ శుక్రవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు రాహుల్ గాంధీని కలిశారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1న ముంబైలో చివరిసారిగా సమావేశం కాగా.. ప్రతిపక్ష ఇండియా కూటమి కోసం ముందుకు సాగే ప్రణాళికపై చర్చించినట్లు తెలిసింది.
కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సీఎం కావచ్చు.. కానీ, బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తరువాత కేటీఆర్ మాత్రమే సీఎం అవుతారు అని ఆయన విమర్శించారు. మన లక్ష్యం సీఎం పదవి కావొద్దు.. ఎప్పుడో ఒకసారి నేనూ కూడా సీఎం అవుతా.. పదవుల మీద నాకు ఆశ లేదు.. ఆశ ఉంటే ఆనాడు మంత్రి పదవి వదిలి పెట్టే వాడిది కాదు అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవబోతోంది అని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు 6 గ్యారంటీలు ఇచ్చాం.. బిల్లా-రంగాలు కాంగ్రెస్ ను తిట్టడమే పనిగా పెట్టుకుని ఉర్ల మీద పడ్డారు.. ప్రజల ఆశీర్వాదం ఎవరి వైపు ఉంటుందో.. తేలిపోనుంది.. పోలింగ్ అయిపోగానే పారిపోయేందుకు సిద్దం అవుతున్నారు.
రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి ఉన్నా.. లేకున్నా కల్వకుర్తి మాత్రం అభివృద్ధి జరగడం లేదు.. ప్రాజెక్ట్ కు కల్వకుర్తి పేరు పెట్టారు తప్ప నీళ్ళు మాత్రం పారలేదు.. భూ సమీకరణకు ఇంత వరకు డబ్బులు ఇవ్వలేదు అని కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు.
Elections: త్వరలోనే ఎన్నికల నగారా మోగబోతోంది. తెలంగాణతో సహా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరనున్నాయి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం అన్ని కసరత్తుల్ని పూర్తిచేసింది. వారంలోపు ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. జాతీయ మీడియా సంస్థల ప్రకారం అక్టోబర్ 8-10 తేదీల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని కథనాలు ప్రచురిస్తున్నాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 15 రోజులుగా చీకట్లోకి వెళ్ళిపోయారు అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ పాలన చూస్తే తెలంగాణ ఎందుకు వచ్చిందని బాధగా అనిపిస్తుంది.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంగంట్లో అమ్మకానికి పెట్టిన సరకుగా మారింది.. రాష్ట్రంలో భార్యాభర్తలు కలిసి సంసారం చేయలేకపోతున్నారు.
PM Modi: కాంగ్రెస్ టార్గెట్గా మరోసారి ప్రధాని నరేంద్రమోడీ విరుచుకుపడ్డారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో మోడీ పర్యటించారు. ‘పేపర్ లీక్ మాఫియా’ రాజస్థాన్ లోని లక్షలాది మంది యువత భవిష్యత్తును నాశనం చేసిందని, సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. జోధ్పూర్ లో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ చేసిన ప్రతీ అవినీతి తమ వద్ద ఉందని, దానిని బయటకు తీసుకురావాలంటే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలని మోడీ అన్నారు.
Bellampalli Congress Leader Gaddam Vinod responded on Porn Videos: వాట్సాప్ గ్రూపులో తాను అశ్లీల మెసేజ్ (పోర్న్ వీడియోలు)లు పోస్ట్ చేసినట్లుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని బెల్లంపల్లి కాంగ్రెస్ నేత గడ్డం వినోద్ స్పష్టం చేశారు. తన డ్రైవర్ తప్పిదం వల్ల మెసేజ్లు వచ్చాయని, ఈ ఘటనలో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. చేయని తప్పును తనపై రుద్ది రాజకీయంగా దెబ్బతీయాలని ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారని గడ్డం వినోద్…