Revanth Reddy : పొత్తుల అంశం ఇంకా చర్చల స్థాయిలోనే ఉన్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించేంత వరకు మీడియా సంయమనం పాటించాలన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పొత్తుల అంశం ఇంకా చర్చల స్థాయిలోనే ఉన్నాయని ఆయన వెల్లడించారు. నిర్ణయాలు జరిగితే మీడియాకు వెల్లడిస్తామని, సీట్ల విషయంలో సమర్థులైన నాయకులను సంప్రదించాకే నిర్ణయం తీసుకుంటామన్నారు రేవంత్ రెడ్డి. వారి వారి హోదాలు, గౌరవం తగ్గకుండా సమన్వయం చేసేందుకు కేసీ వేణుగోపాల్ గారు కమిటీని నియమించారని, ఎలాంటి సమస్యలు ఉన్నా కమిటీ సభ్యులు ఇంచార్జ్ ఠాక్రే, దీపాదాస్ మున్షి, మీనాక్షి నటరాజన్ , జానారెడ్డి ఎల్లవేళలా అందుబాటులో ఉంటారన్నారు రేవంత్ రెడ్డి. కొందరు అధికారులు బీఆరెస్ కు కొమ్ముకాస్తున్నారన్నారు.
అంతేకాకుండా.. ‘అలాంటి అధికారులపై పీఏసీ సమావేశంలో చర్చించాం. నిబంధనలు ఉల్లంఘించి కొందరు అధికారులు నిధులు విడుదల చేస్తున్నారు. పెన్షన్ తప్ప మిగతా వాటికి ఎన్నికలయ్యేవరకు ఎలాంటి నిధులు విడుదల చేయొద్దు. చట్టంలో లొసుగులు వాడుకుని ఎన్నికల్లో లబ్ది పొందాలని బీఆరెస్ ప్రయత్నిస్తోంది. బీఆర్‌ఎస్‌కు కొమ్ముకాసే పోలీస్, ఐఏఎస్, రెవెన్యూ, అన్ని విభాగాల అధికారుల వివరాలను కాంగ్రెస్ సేకరిస్తోంది. మేం నియమించిన ప్రత్యేక కమిటీ ఆ వివరాలతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తుంది. రాజకీయ పార్టీల సొంత మీడియా కాంగ్రెస్ పై అపోహలు సృష్టిస్తోంది. తప్పుడు వార్తలు వేసే మీడియా యజమాన్యాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. తప్పుడు వార్తలు వేసి కార్యకర్తల్లో గందరగోళం సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవు. కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడితే కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన ఆరు నెలల ముందు వేసిన అన్ని టెండర్లపై అధికారంలోకి రాగానే సమీక్షిస్తాం.
Also Read
- Saudi Houthi Attack: సౌదీ అరేబియాపై హౌతీల భారీ దాడులు.. పాకిస్తాన్, టర్కీ ఏం చేస్తాయి.?
- YouTuber Rama Nandana: ఇబ్రహీంపట్నం పీఎస్లో యూట్యూబర్ రమా నందన విచారణ..
- Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
- Ashwini Vaishnaw: 320 కిమీ వేగం.. 12 స్టేషన్లు.. 508 కి.మీ కారిడార్.. బుల్లెట్ రైలుపై కేంద్ర మంత్రి కీలక అప్డేట్..
భూముల అమ్మకాలనూ సమీక్షిస్తాం. కేంద్ర ఎన్నికల సంఘం నియమావళికి అనుగుణంగానే ప్రభుత్వం పని చేయాలి. నియమ నిబంధనలు ఉల్లంఘించి బీఆరెస్ కు ప్రయోజనం చేకూర్చే అధికారులందరిపై కఠిన చర్యలు తప్పవు. హైదరాబాద్ లో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి ప్రకటనలకు అవకాశం ఇవ్వాలని మెట్రో హైదరాబాద్ వారికి సూచిస్తున్నా. బస్సు యాత్రపై రెండు రకాల సూచనలు వచ్చాయి.. అభ్యర్థులను ప్రకటించి బస్సు యాత్రకు వెళ్లాలా.. లేక బస్సు యాత్ర మధ్యలో అభ్యర్థులను ప్రకటించాలా అనే అంశాన్ని పరిశీలిస్తున్నాం. జాతీయ నాయకత్వం సూచన మేరకు బస్సు యాత్రపై నిర్ణయం తీసుకుంటాం. నర మాంసానికి అలవాటు పడ్డ కుటుంబం పులులతో పోల్చుకుంటోంది. తండ్రిని జంతువుతో కేటీఆర్ కరెక్ట్ గా పోల్చారు.’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Saudi Houthi Attack: సౌదీ అరేబియాపై హౌతీల భారీ దాడులు.. పాకిస్తాన్, టర్కీ ఏం చేస్తాయి.?
-
Nandu: బిగ్ బాస్ కోసం వచ్చి ఇరుక్కున్న నందన?
-
Reliance Bonds: డబ్బు దాచేవారికి రిలయన్స్ బంపర్ ఆఫర్.. 7.47% వడ్డీపై ఈ విషయాలు తెలుసుకోండి!
-
YouTuber Rama Nandana: ఇబ్రహీంపట్నం పీఎస్లో యూట్యూబర్ రమా నందన విచారణ..
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!