Sharad Pawar: ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ బీజేపీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తుపై మాట్లాడుతూ.. బీజేపీతో వెళ్లే ప్రశ్నే లేదని కుండబద్ధలు కొట్టారు. ఇండియా టుడే కాంక్లేవ్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే ఇప్పటికే శరద్ పవార్ పార్టీ ఎన్సీపీలో చీలిక వచ్చింది. అజిత్ పవార్ వర్గం బీజేపీ, ఏక్నాథ్ షిండే శివసేనతో చేతులు కలిపి మహారాష్ట్రలో అధికారంలో ఉంది.
చిన్న తనంలోనే ఎన్టీఆర్ అవకాశం ఇచ్చారు.. ప్రజాహితం కోసం అభివృద్ధి కోసమే రాజకీయాలు చేస్తా నా స్వార్ధం కోసం చేయను.. మంత్రిగా ఉండి పాలేరు నియోజకవర్గంలో ఉన్న సమస్యలను తీర్చే అవకాశం శ్రీరామచంద్రుడు నాకు కల్పించారు అని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
సిద్దిపేట రైల్వే లైన్ కోసం కష్టపడ్డది మేము... డబ్బులు ఇచ్చింది మేమన్నారు. ఈ విజయం తెలంగాణ ప్రజలదని పేర్కొన్నారు. ఆనాడు 9 ఏళ్ళు కాంగ్రెస్ మోసం చేసింది...ఈనాడు బీజేపీ అబద్ధాలు ఆడుతుందని మండిపడ్డారు. కేసీఆర్ లేకపోతే రైల్వే లైన్ లేదని హరీష్ రావు అన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఉన్నది ఫెవికాల్ బంధమన్న విషయం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిజామాబాద్ సాక్షిగా మరోసారి స్పష్టం చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. వారిద్దరు చీకటి మిత్రులు.. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అని తాము మొదటి నుండి చెబుతున్నదే నిజం అని మోడీ మాటల ద్వారా సుస్పష్టంగా తేలిందని రేవంత్ రెడ్డి చెప్పారు.
ఇందూరు సభలో ప్రధాని మోడీ కేసీఆర్ సీక్రెట్స్ అన్ని బయటపెట్టారు. తాను తెలంగాణ పర్యటనకు వస్తున్న సమయంలో తనకు స్వాగతం పలకపోవడంపై కీలక విషయాలు చెప్పారు. GHMC ఎన్నికలకు ముందు కేసీఆర్ తనకు స్వాగతం పలికేవారన్నారు. కానీ GHMC ఎన్నికల తర్వాత సీన్ మారిపోయిందని తెలిపారు. GHMC ఎన్నికల్లో బీర్ఎస్ కు మద్దతు ఇవ్వమని కేసీఆర్ తనను అడిగారని చెప్పారు.
సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో బీసీ కుల గణన చేపట్టాలని లేఖలో ప్రస్తావించారు. బీసీ కుల గణన చేపట్టాలని సుదీర్ఘ కాలంగా డిమాండ్ ఉందని.. బీసీ జనగణన డిమాండ్ కు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ప్రకటించిందని తెలిపారు. ఈ విషయంలో బీసీ సంఘాలు చేపట్టిన ప్రతి నిరసన, ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచిందని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.
Rahul Gandhi: దేశంలో తొలిసారిగా బీహార్ రాష్ట్రం కులాల వారీగా సర్వే చేసింది. కుల గణన ఫలితాలను ఈ రోజు వెల్లడించింది. నితీష్ కుమార్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వం చేసిన ఈ పనిని కాంగ్రెస్ స్వాగతించింది. సామాజిక న్యాయం చేయడానికి, సామాజిక సాధికారత కోసం జాతీయ స్థాయిలో ఇలాంటి కసరత్తు చేయాలని కేంద్రాన్ని కోరింది.
ప్రధాని మోడీ మధ్యప్రదేశ్ పర్యటనలో ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. అభివృద్ధి వ్యతిరేకులకు దేశం ఆరు దశాబ్దాలు సమయం ఇచ్చింది. అప్పుడు ఏం అభివృద్ధి చేశారని మండిపడ్డారు. అభివృద్ధిని పక్కన పెట్టి, పేదవాళ్ళ భావోద్వేగాలతో ఆడుకునేవారని విమర్శించారు.