PM Modi: ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్’లో కాంగ్రెస్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు ప్రధాని నరేంద్రమోడీ. శుక్రవారం మొబైల్ కాంగ్రెస్ ఏడో ఎడిషన్ ని ప్రారంభించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ గురించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని ‘పాత ఫోన్’గా అభివర్ణించారు. 2014లోనే ప్రజలు ఆ ఫోన్లను వదిలేసి దేశ గతని మార్చే ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని ఆయన అన్నారు.
రేపు తెలంగాణలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పర్యటించనున్నారు. అలాగే, ఎల్లుండి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే సైతం టీకాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.
రాష్ట్రంలో 24 గంటల కరెంటు, రైతుబంధు, అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ గెలవాలన్నారు. కాంగ్రెస్ నాయకులు అహంకారంగా మాట్లాడుతున్నారు.. గుడుంబా ప్యాకేట్ ఇస్తే ఓటు వేస్తారని అంటున్నారు.. అవమానకరంగా అవహేళన చేస్తున్నారు అని కేసీఆర్ తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ నేడు పాలేరులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన ఖమ్మం నేతలపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులపై ఆయన మండిపడ్డారు.
మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.. అదే సోషల్ మీడియాలో సమాధానాలు చెప్పండి.. గతంలో సిరిసిల్లకు ఇప్పటి సిరిసిల్లకు తేడాను సోషల్ మీడియాలో ప్రచారం చేయండి.. సిరిసిల్ల ఒకప్పుడు ఉరిసిల్లగా ఉండే.. కానీ, ఇప్పుడు ఎలా అభివృద్ధి చెందిందో తెలపండి అని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పై పోటీ చేస్తానన్న రేవంత్ రెడ్డిని ఈ విషయంలో మెచ్చుకుంటున్నాను రేవంత్ రెడ్డి మొండోడు, ధైర్యవంతుడు అంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Israel Hamas War : ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్య చేశారు. గాజాలో ఏడు వేల మందిని చంపిన తర్వాత కూడా రక్తపాతం, హింస ఆగలేదన్నారు.
5 States Elections: 5 రాష్ట్రాల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. 2024 లోక్ సభ ఎన్నికల ముందు జరుగుతున్న ఎన్నికలు కావడంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నువ్వానేనా అనే రీతిలో పోరాడుతున్నాయి. దీంతో మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హీటెక్కింది. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. కొన్నిసార్లు ఈ విమర్శలు వివాదాస్పదం అవుతున్నాయి.
Tiger claw row: ‘పులిగోరు’ వివాదం కర్ణాటక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదంపై బీజేపీ, అధికార కాంగ్రెస్ మధ్య విమర్శలు చెలరేగుతున్నాయి. రాజ్యసభ ఎంపీ, నటుడు జగ్గేష్ టీవీ లైవ్ షో ఇంటర్వ్యూలో పులి-గోరు లాకెట్ ధరించి కనిపించడంతో అతని ఇంట్లో అటవీ శాఖ సోదాలు చేసింది. అంతకుముందు కన్నడ స్టార్ హీరో దర్శన్ కూడా ఇలాంటి లాకెట్ ధరించి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతని ఇంట్లో కూడా అటవీ శాఖ…
రైతు బంధు పథకం కొత్తది కాదు అని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈసీనీ కాంగ్రెస్ నేతలు కలిసి రైతు బంధు ఆపాలని కోరింది అని ఆయన తెలిపారు. కేసీఅర్ రైతు బంధు తర్వాతే కేంద్రం పీఎం కిసాన్ స్కీమ్ తీసుకు వచ్చింది.. రైతులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే పరిస్థితి లేదు.. 69 లక్షల మందికి రైతు బందు అందుతోంది.