హైదరాబాద్ ఎల్బీ నగర్‌లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బీఆర్‌ఎస్ బూత్ లెవల్ కార్యకర్తల సమావేశానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలను కలిసినప్పుడు 2014ల ఎట్లా ఉండే…ఇప్పుడు ఎట్లా ఉంది అని అడగాలన్నారు. హైదరాబాద్ మహా నగరం ను విశ్వ నగరంగా మార్చే క్రమం లో అడుగులు ముందుకు వేస్తున్నామని, గతంను మరిచి పోయి గందరగోళం పడిపోతాం… ఇది మానవ నైజమన్నారు. 2014 కు ముందు 10 గంటలు కరెంట్ పోయిన అడిగేవాడు వాడు…చెప్పే వాడు లేడని, ఇప్పుడు 10 నిముషాలు కరెంట్ పోతే ఇదేనా బంగారు తెలంగాణ అని సోషల్ మీడియాలో పెడుతున్నారన్నారు. కర్ణాటకలో ప్రజలు కరెంట్ లేక రోడ్లు ఎక్కుతున్నారని, కర్ణాటక ఉప ముఖ్య మంత్రి ఉన్న ముచ్చట్ట చెప్పిపోయారన్నారు. అయిదు గంటలు కరెంట్ కష్టపడి ఇస్తున్నాం అని డికె శివ కుమార్ చెప్పారని, తెలంగాణ లో 24 గంటల కరెంటు ఉచితంగా ఇస్తూ ఉంటే…కాంగ్రెస్ కు పొరపాటు న ఓటు వేస్తారా ఎవరైనా ? అని ఆయన అన్నారు. కాంగ్రెస్ అంటే అంటే అంధకారం…కరెంట్ కోతలు అని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే దుష్ట పాలన వస్తుందని ఓటర్లకు చెప్పాలన్నారు మంత్రి కేటీఆర్..
Also Read : Pilot Rohith Reddy : మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మరు
కాంగ్రెస్ అభ్యర్థి మధు యాష్కికి ఎల్బీనగర్ గురించి ఏం తెలుసన్నారు. కాంగ్రెస్ వాళ్లు సీట్లు పంచుకునే సరికి మనం స్వీట్లు పంచుకుంటున్నామని చెప్పారు. ఇచ్చిన హామీ నెరవేర్చకుంటే రాజీనామా చేస్తానన్న నాయకుడు సుధీర్ రెడ్డి అన్నారు. ఎల్బీనగర్‌లో బీజేపీ కార్పొరేటర్లను గెలిపిస్తే పైసా పని చేయలేదని విమర్శించారు. బూత్‌స్థాయి కార్యకర్తలు బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ఇంటింటికి వెళ్లి చెప్పాలని సూచించారు. ఎల్బీనగర్ ఎంత అభివృద్ధి చెందిందో గుర్తుచేయాలన్నారు. సీఎం కేసీఆర్ పథకాలను ప్రతి ఇంటికి వివరించాలన్నారు. అన్నపూర్ణ పథకం ద్వారా రేషన్ కార్డులకు సన్నబియ్యం ఇస్తామని, కేసీఆర్ బీమాతో ప్రతి ఇంటికి ధీమా అన్నారు. రూ.400లకే వంటగ్యాస్ సిలిండర్ వంటి పథకాలను గురించి వివరించాలని మంత్రి కేటీఆర్ సూచించారు.