Minister Konda Surekha on Medaram Jatara: ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం ‘సమ్మక్క సారలమ్మ’ జాతరకు వచ్చే భక్తులకు ప్రశాంతమైన దర్శనం కల్పిస్తాం అని పర్యావరణం, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చెప్పారు. అన్ని శాఖల సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేస్తాం అని తెలిపారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరిగే జాతర నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.150 కోట్లు విడుదల చేసింది. వచ్చే…
పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బిల్లులను ప్రవేశపెట్టారు. 130వ రాజ్యాంగ సవరణ బిల్లు, జమ్మూకశ్మీర్ బిల్లు, రాజకీయ నేతల నేరాలపై కీలక బిల్లులను ప్రవేశ పెట్టారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటమిపై పోస్ట్ మార్టమ్ చేసిన కాంగ్రెస్ కు.. ఓట్ల చోరీపై కొన్ని ఆధారాలు దొరికాయని రాహుల్ చెబుతున్నారు. ఆయన ఇప్పటికే ఓట్ల చోరీపై ఇండియా కూటమి నేతలకు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈసీకి కొన్ని సవాళ్లు కూడా విసిరారు. త్వరలో ఎన్నికలు జరగబోతున్న బీహార్లో ఓటు అధికార యాత్ర మొదలుపెట్టారు రాహుల్.
త్వరలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఎన్డీఏ కూటమి-ఇండియా కూటమి మధ్య హోరాహోరీ ఫైటింగ్ సాగేలా ఉంది. మరోసారి అధికారం కోసం ఎన్డీఏ కూటమి ప్రయత్నిస్తుంటే... ఈసారి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఇండియా కూటమి భావిస్తోంది. ఇలా ఇరు పక్షాలు ప్రణాళికలు రచిస్తున్నాయి.