Guvvala Balaraju : బీఆర్ఎస్ – కాంగ్రెస్ మధ్య ఉన్న రాజకీయ సంబంధాలపై మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు గువ్వల బాలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ వ్యవహరించిన విధంగానే సీఎం రేవంత్ రెడ్డి కూడా వ్యవహరిస్తున్నారని, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గొంతు నొక్కే విధానాన్ని అవలంబిస్తోందని ఆయన విమర్శించారు. “కాంగ్రెస్, బీఆర్ఎస్లు కలసి నడుస్తున్నాయి. ‘నువ్వు కాకుంటే నేను, నేను కాకుంటే నువ్వు’ అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి” అని బాలరాజు వ్యాఖ్యానించారు. రాహుల్…
Raj Gopal Reddy demands Minister Post: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తనకు మంత్రి పదవి ఇవ్వకుండా ఎవరు అడ్డుకుంటున్నారు? అని ప్రశ్నించారు. తనను పార్టీలోకి తీసుకున్నప్పుడు మేము ఇద్దరం అన్నదమ్ములం ఉన్నామని కాంగ్రెస్ హైకమాండ్‌కు తెలియదా? అనిమండిపడ్డారు. ఇద్దరం అన్నదమ్ముల్లో ఇద్దరం సమర్థులమే అని, ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తే తప్పేంటి? అని అడిగారు. ఆలస్యమైనా సరే తాను ఓపిక పడుతా అని, తనకు మంత్రి పదవి…
KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అప్పులపై కాంగ్రెస్ పార్టీ అబద్ధాలను ఖండించారు. రేవంత్ రెడ్డి పొడుగుచేసిన అప్పులపై వివాదాలను ఆయన కఠినంగా విమర్శించారు. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం, బీఆర్ఎస్ హయాంలో తెలంగాణకు ఉన్న అప్పు మొత్తం 8 లక్షల కోట్లుగా కాదు, కేవలం రూ. 3.5 లక్షల కోట్లే ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ నిజాలు బయటపడటంతో కాంగ్రెస్ పార్టీ ఆర్థిక నాటకాలు ఆపవలసి వచ్చింది. Donald…
Komatireddy Rajagopal Reddy Tweet: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవలి కాలంలో నిత్యం వార్తల్లో ఉంటున్నారు. సంచలన వ్యాఖ్యలు, ట్వీట్స్ చేస్తూ సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేస్తున్నారు. జర్నలిస్టులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను అయన ఖండించారు. తాజాగా మునుగోడు ఎమ్మెల్యే మరో ట్వీట్ చేశారు. తనకు మంత్రి పదవి ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారని, ఇది ముమ్మాటికీ వాస్తవమని పేర్కొన్నారు. అసలు వాస్తవాన్ని ప్రజలకు వివరించిన…
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో విభేదాలు రచ్చకెక్కాయి. ఇప్పటికే సిద్ధరామయ్య- డీకే.శివకుమార్ వర్గాలు రెండుగా విడిపోయాయి. ముఖ్యమంత్రి మార్పును శివకుమార్ వర్గీయులు కోరుకుంటుంటే.. అందుకు సిద్ధరామయ్య ససేమిరా అంటుకున్నారు. సీటులోంచి దిగే ప్రసక్తేలేదని తేల్చి చెబుతున్నారు. ఈ పంచాయితీ ఇలా ఉంటుండగా తాజాగా కొత్త పంచాయితీ రచ్చ చేస్తోంది.
Bandi Sanjay : భారతీయ జనతా పార్టీ నేత, కేంద్రమంత్రి బండి సంజయ్ బూటకపు విచారణలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ, ఫోన్ ట్యాపింగ్ కేసులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోణాన్ని తప్పుగా మలుపు తిప్పుతోందని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నప్పటికీ వారిని మాత్రం పట్టించుకోవడం లేదని విరుచుకుపడ్డారు. బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యాంశం.. మాజీ సీఎం…
తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలయ్యేనా అనే చర్చ నడుస్తోంది. రాష్ట్రం పంపిన బిల్స్ కేంద్రం ఆమోదించే పరిస్థితి కనబడటం లేదు. రాష్ట్రపతి ఆమోదం లేకుండా రిజర్వేషన్లు పెంచే పరిస్థితి రాష్ట్రంలో లేదు. మరి ఇంత చేసిన తెలంగాణ సర్కార్ ఇక ఏం చేయబోతుందనేది సర్వత్రా చర్చాంశనీయంగా మారింది. రాహూల్ హామీ ఇచ్చారంటూ, దాన్ని అమలు చేసే బాధ్యత మాదే అంటూ తెలంగాణ సర్కార్ రాష్ట్రంలో కుల గణన చేసింది. జనాభా లెక్కలతో పాటూ పలు…
దేశంలో ఓట్ల దొంగతనం జరుగుతుందంటూ లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. గురువారం ఢిల్లీలో ఇండియా కూటమికి ఇచ్చిన విందులో రాహుల్ గాంధీ ప్రజెంటేషన్ ఇచ్చారు. బీజేపీ-ఎన్నికల సంఘం ఓట్ల కుట్ర చేసిందని తీవ్రంగా ఆరోపించారు.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట్లో....బీసీ రిజర్వేషన్ల అంశం మీద జోరుగా చర్చ జరుగుతోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ ఇవ్వాలన్న విషయంలో అన్ని పార్టీలది ఒకటే మాట. కానీ... సాధనలో మాత్రం ఎవరి రాజకీయాలు వారివి అన్నట్టుగా నడుస్తోంది వ్యవహారం. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకుంది.