Chidambaram: 2008 ముంబై ఉగ్రవాద దాడుల గురించి మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ నేత పి. చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. 175 మంది ప్రాణాలను బలిగొన్న ఈ ఘోర ఉగ్రవాద ఘటన తర్వాత, అప్పటి యూపీఏ ప్రభుత్వం పాకిస్తాన్‌తో యుద్ధం చేయాలని భావించిందని, అయితే అమెరికా ఒత్తిడి మేరకు తాము ఆ పనిచేయలేదని చిదంబరం అన్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వాయిదా వేయలేని ఉత్కంఠ కొనసాగుతోంది. ఇటీవల 10 మంది BRS ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిన విషయం బహిరంగంగా వెల్లడైన సంగతి తెలిసిందే.
ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతా మోహన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ‘భారత దేశ వ్యాప్తంగా భారత రాజ్యాంగ పరిరక్షణ యాత్ర సాగుతోంది. 11 ఏళ్లుగా ప్రధానిగా మోడీ కొనసాగుతున్నారు. నల్లధనం బయటకు తీస్తా అన్న మోడీ ఇప్పటికి ఒక్క రూపాయి తీసాడా?. మోడీ చెప్పిన వాగ్దానం అమలులో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ప్రతి ఒక్కరి ఖాతాల్లో 15 లక్షలు వేస్తామన్న మోడీ ఇంతవరకు ఒక్క…
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను ప్రభుత్వ పనితీరుకు రెఫరెండంగా భావించాలా? ఆ విషయమై పార్టీ, ప్రభుత్వ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? తమ రెండేళ్ళ పరిపాలన తర్వాత జరగబోతున్న ఎలక్షన్స్‌కు అధికార పార్టీ ఏ రూపంలో సిద్ధమవుతోంది? ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కలిసొచ్చేవి, వ్యతిరేక అంశాలేంటి? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తొలిసారి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది. లోకల్ బాడీస్ ఎన్నికల్లోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి…
అక్టోబర్ నెలాఖరు వరకు తెలంగాణలో డీసీసీ అధ్యక్షుల నియామకాలు పూర్తవుతాయని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. జిల్లాల్లో సమర్దవంతమైన నాయకత్వాన్ని రూపొందించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశించారని చెప్పారు. క్షేత్ర స్థాయిలో ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కునే నాయకులకే బాధ్యతలు అప్పగించాలని ఖర్గే నిర్గేశించారన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు, తీసుకుంటున్న ప్రజాహిత నిర్ణయాలను ఖర్గేకు తాను వివరించానని మహేశ్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు. Also Read: Jubilee Hills By Election: జూబ్లీహిల్స్…
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై ప్రతి ఒక్కరూ ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బి ఆర్ ఎస్ పార్టీల నేతలు విచిత్రమైన మానసిక వ్యాధి తో బాధపడుతున్నారని అన్నారు. వాళ్లకు బిజెపి ఫోబియా పట్టుకుందన్నారు. చిల్లర మాటలు, అవగాహన లేకుండా, ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారని తెలిపారు. బిజెపికి తెలంగాణ లో ఎవరితో కలవాల్సిన అవసరం లేదన్నారు. కెసిఆర్, కేటీఆర్, బిఆర్ఎస్, కాంగ్రెస్ లతో బిజెపి…
జీఎస్టీలో మార్పులు దేశాభివృద్ధిలో నిర్మాణాత్మక సంస్కరణలు అని ప్రధాని మోడీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్లో ఏర్పాటు చేసిన సభలో మోడీ ప్రసంగించారు. యూపీఏ హయాంలో ట్యాక్స్‌ల మోత మోగిందని.. 2014 ముందు పన్నులతో ప్రజలకు నరకం చూపించారని ఆరోపించారు.
లడఖ్ అల్లర్ల వెనుక కాంగ్రెస్ కౌన్సిలర్ ఫుంటోగ్ స్టాన్జిన్ త్సెపాగ్ హస్తం ఉన్నట్లుగా బీజేపీ ఐటీ సెల్ అధిపతి అమిత్ మాల్వియా ఎక్స్‌లో ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేశారు. రాహుల్‌గాంధీ ఇలాంటి అశాంతిని కోరుకుంటున్నారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కౌన్సిలర్.. బీజేపీ కార్యాలయం, వాహనాలు తగలబెట్టాలని ప్రేరేపించారని బీజేపీ ఆరోపించింది.
కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం (AICC) తెలంగాణలో డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియను సీరియస్‌గా ప్రారంభించడానికి ముందుగా 22 మంది పరిశీలకులను నియమించింది.