అక్టోబర్ నెలాఖరు వరకు తెలంగాణలో డీసీసీ అధ్యక్షుల నియామకాలు పూర్తవుతాయని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. జిల్లాల్లో సమర్దవంతమైన నాయకత్వాన్ని రూపొందించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశించారని చెప్పారు. క్షేత్ర స్థాయిలో ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కునే నాయకులకే బాధ్యతలు అప్పగించాలని ఖర్గే నిర్గేశించారన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు, తీసుకుంటున్న ప్రజాహిత నిర్ణయాలను ఖర్గేకు తాను వివరించానని మహేశ్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు. Also Read: Jubilee Hills By Election: జూబ్లీహిల్స్…
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై ప్రతి ఒక్కరూ ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బి ఆర్ ఎస్ పార్టీల నేతలు విచిత్రమైన మానసిక వ్యాధి తో బాధపడుతున్నారని అన్నారు. వాళ్లకు బిజెపి ఫోబియా పట్టుకుందన్నారు. చిల్లర మాటలు, అవగాహన లేకుండా, ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారని తెలిపారు. బిజెపికి తెలంగాణ లో ఎవరితో కలవాల్సిన అవసరం లేదన్నారు. కెసిఆర్, కేటీఆర్, బిఆర్ఎస్, కాంగ్రెస్ లతో బిజెపి…
జీఎస్టీలో మార్పులు దేశాభివృద్ధిలో నిర్మాణాత్మక సంస్కరణలు అని ప్రధాని మోడీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్లో ఏర్పాటు చేసిన సభలో మోడీ ప్రసంగించారు. యూపీఏ హయాంలో ట్యాక్స్‌ల మోత మోగిందని.. 2014 ముందు పన్నులతో ప్రజలకు నరకం చూపించారని ఆరోపించారు.
లడఖ్ అల్లర్ల వెనుక కాంగ్రెస్ కౌన్సిలర్ ఫుంటోగ్ స్టాన్జిన్ త్సెపాగ్ హస్తం ఉన్నట్లుగా బీజేపీ ఐటీ సెల్ అధిపతి అమిత్ మాల్వియా ఎక్స్‌లో ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేశారు. రాహుల్‌గాంధీ ఇలాంటి అశాంతిని కోరుకుంటున్నారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కౌన్సిలర్.. బీజేపీ కార్యాలయం, వాహనాలు తగలబెట్టాలని ప్రేరేపించారని బీజేపీ ఆరోపించింది.
కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం (AICC) తెలంగాణలో డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియను సీరియస్‌గా ప్రారంభించడానికి ముందుగా 22 మంది పరిశీలకులను నియమించింది.
గత ఢిల్లీ పాలకులు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిని పట్టించుకోలేదని ప్రధాని మోడీ విమర్శించారు. మోడీ సోమవారం అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇటానగర్ సభలో మోడీ ప్రసంగించారు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆరోపణలు, ప్రత్యారోపణలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.