కాంగ్రెస్ పార్టీలో పోట్ల గిత్తల్ని ఆపేవాళ్ళు లేరా? ఎవరికి వారు కట్లు తెంచుకున్నట్టు నోటికి పని చెబుతూ చెలరేగిపోవడమేనా? చివరికి మంత్రులు సైతం కట్టు తప్పుతున్నా… కంట్రోల్ చేసే దిక్కు లేకుండా పోయిందా? చివరికి మంత్రులతో సహా… మొత్తం ప్రభుత్వమే పలుచన అవుతున్నా… పెద్దలు ఎవ్వరూ ఎందుకు రియాక్ట్ అవడంలేదు? అధికార పార్టీలో అసలేం జరుగుతోంది? తెలంగాణలో మంత్రుల వ్యవహారం రోజురోజుకు శృతిమించుతున్నట్టు కనబడుతోంది. ఎవరికి వారు అసలు పని వదిలేసి.. ఇష్టా రాజ్యాంగా మాట్లాడేస్తున్నారన్న…
తెలంగాణ మొత్తం ఒక రూల్, మునుగోడు నియోజకవర్గంలో మాత్రం మరో రూలా? ఏ… బిడ్డా… ఇది నా అడ్డా…. ఇక్కడ నా మాటే శాసనం అంటూ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సొంత రాజ్యాంగం అమలు చేస్తున్నారా? ఏ విషయంలో ఎమ్మెల్యే ప్రభుత్వ విధానాన్నే సవాల్ చేస్తున్నారు? అందుకు ఆయన చెబుతున్న రీజన్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఫైర్‌బ్రాండ్ లీడర్స్‌లో ఒకరైన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సరికొత్త వివాదానికి తెర లేపారు. తన నియోజకవర్గంలో కొత్తగా ఏర్పాటు…
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ మరోసారి విదేశాల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో కొంత మందికే విద్యా హక్కు ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఉన్నత కులాల ప్రయోజనాలకే ప్రభుత్వ సేవ చేస్తోందని.. మధ్యతరగతి, దిగువ కులాలు, గిరిజన వర్గాల చరిత్ర, సంప్రదాయాలు, సహకారాలను విస్మరిస్తుందని ధ్వజమెత్తారు.
రేపు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలకానుంది. ఎన్నికల సంఘం రేపు ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. రేపటి నుంచి మొదలు 21వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ చేపట్టనున్నారు. 22 న నామినేషన్లు పరిశీలన కాగా.. 24 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇవ్వనున్నారు. నామినేషన్ల స్వీకరణకు సర్వం సిద్ధం చేసిన జిల్లా ఎన్నికల సంఘం. షేక్ పేట్ తహసిల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఏర్పాటు చేశారు. Also Read:…
అక్కడి హస్తం పార్టీలో ఐక్యత మేడిపండు చందమేనా? నాయకులు పైకి కౌగిలించుకుంటున్నట్టు కనిపిస్తున్నా… కడుపులో కత్తులు పెట్టుకుని తిరుగుతున్నారా? జిల్లాలో ఉన్నదే ముగ్గురు ఎమ్మెల్యేలు. వాళ్ళలో ఇద్దరు ఒక వర్గం, ఒకాయన మరో వర్గంగా రాజకీయం చేస్తున్నారా? జిల్లా అధ్యక్షుడు తాజాగా ఇచ్చిన సీరియస్ వార్నింగ్ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకేనా? ఎవరా ముగ్గురు? ఏంటా మేడిపండు కథ? మహబూబ్ నగర్ జిల్లా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. తాజాగా పార్టీ…
Rahul Gandhi: హర్యానా ఐపీఎస్ అధికారి వై పురాణ్ కుమార్ ఆత్మహత్య వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆయన ఆత్మహత్యపై పార్లమెంట్లో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. ఈ ఆత్మహత్యను బీజేపీ, ఆర్ఎస్ఎస్తో ముడిపెడుతూ ఆరోపణలు చేశారు. ఇది కులం పేరుతో మానవత్వాన్ని నలిపేస్తున్న ‘తీవ్రమవుతున్న సామాజిక విషానికి’ చిహ్నంగా అభివర్ణించారు. ఆయన ఎక్స్ వేదికగా వరస ట్వీట్లలో సంచలన ఆరోపణలు చేశారు.
KTR : తెలంగాణ రాష్ట్రంలోని బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత విధానాలను ప్రదర్శించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లపాటు అడ్డగోలు విధానాలతో 42 శాతం హామీను నిర్ధారించకుండా నిలిపి, రేవంత్ రెడ్డి బీసీలను దారుణంగా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. కాంగ్రెస్ పార్టీ న్యాయస్థానంలో నిలబడని జీఓ (గవర్నమెంట్ ఆర్డర్) ద్వారా బీసీలకు హామీ ఇచ్చినట్లు మభ్యపెట్టిందన్నారు. కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ కూడా వెన్నుపోటు పొడిచిన…
ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంతి కిషోర్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. 51 మందితో కూడిన జాబితాను ప్రకటించారు. 16 శాతం ముస్లింలకు కేటాయించగా.. 17 శాతం అత్యంత వెనుకబడిన వర్గాలకు చెందినవారికి కేటాయించారు.
Jubilee Hills By Election: తెలంగాణలో రాజకీయంగా తీవ్ర ఉత్కంఠ రేపుతోన్న జూబ్లీహల్స్ ఎన్నికల్లో ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుండగా.. అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రకటన ఎప్పుడు అంటూ అంతా ఎదురు చూస్తున్నారు.. ఈ తరుణంలో జూబ్లీహిల్స్ బరిలో దిగే అభ్యర్థి పేరును ప్రకటించింది కాంగ్రెస్.. పార్టీ నేత నవీన్ యాదవ్ పేరును అధికారికంగా ప్రకటించింది ఏఐసీసీ.. బీసీలకు ప్రాధాన్యత ఇస్తామంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ తీసుకొచ్చిన కాంగ్రెస్…
PM Modi: నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమంలో ఆయన కాంగ్రెస్ హయాంలోని యూపీఏ పాలనపై విమర్శలు గుప్పించారు. 2008 ముంబై ఉగ్రవాద దాడుల తర్వాత కాంగ్రెస్ పార్టీ తన ‘‘బలహీనత’’ను ప్రదర్శించిందని ఆరోపించారు. అప్పటి రాజకీయ నిర్ణయాలు మరో దేశం నుంచి వచ్చిన ఒత్తిడి ద్వారా ప్రభావితమయ్యాయని బుధవారం ఆరోపించారు. ముంబై దేశంలోని అత్యంత శక్తివంతమైన నగరాల్లో ఒకటి అని, అందుకే ఉగ్రవాదులు 26/11…