Congress MLA: కేరళలోని కలూర్ స్టేడియంలో ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమా థామస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టేజీపై సదరు ఎమ్మెల్యేతో పాటు నిర్వాహకులు, కార్యక్రమానికి వచ్చిన వారితో మాట్లాడుతున్నారు. ఆ తర్వాత కుర్చీలో నుంచి లేచి పక్కకు వెళ్లే టైంలో ఆమె.. వేదికపై నుంచి జారి కింద పడిపోయారు.
Manmohan Singh: భారత మాజీ ప్రధాని, భారత ఆర్థిక వ్యవస్థ రూపశిల్పిగా పేరున్న మన్మోహన్ సింగ్ ఇటీవల మరణించిన విషయం మనకు తెలిసిందే. ఆయన మరణం తర్వాత ఆయన స్మారక చిహ్నంపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య వివాదం నెలకొంది. అయితే, కేంద్రం తాజాగా మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం నిర్మించేందుకు ప్రక్రియ ప్రారంభించింది. సో
Parliament scuffle: డిసెంబర్ 19న పార్లమెంటు ఆవరణలో ఎంపీల మధ్య తోపులాట జరిగిన ఘటనలో బీజేపీ ఎంపీలు ప్రతాప్‌చంద్ర షడంగీ, ముకేశ్ రాజ్‌పూత్ గాయపడ్డారు. ఈ ఘటనపై తాజాగా గాయపడిన వారిలో ఒక ఎంపీ షడంగీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు.
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో పని చేస్తున్న 6,000 మంది ఆర్పీలకు వెంటనే వేతనాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా అయినా ఆర్పీలకు పెండింగ్ జీతాలను చెల్లించి.. వారి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరారు. పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకే జీతాలు చెల్లించకుండా.. వారిని పేదరికంలోకి నెడుతున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లిందని హరీష్ రావు విమర్శించారు. ఈ మేరకు…
గురుకుల పాఠశాలలో విద్యార్థినులు పడుతున్న భాదలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి స్పందించారు. పైడి రాకేష్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్మూర్ నియోజకవర్గంలోని ఓ గురుకుల విద్యార్థినులు తమకు సరిగా అన్నం కూడా పెట్టడం లేదని కన్నీరుమున్నీరు అయ్యారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిన తెలంగాణ రాష్ట్రంలో పట్టెడన్నం కోసం పసిబిడ్డల ఆర్తనాదాలా? అంటూ ఆవేదన…
మహారాష్ట్ర మంత్రి నితీష్ రాణే సంచలన వ్యాఖ్యలు చేశారు. కేరళ మినీ పాకిస్థాన్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందుకే అక్కడ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ గెలిచారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ అగ్ర నాయకుడు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ వియత్నాం పర్యటనకు వెళ్లారు. కొత్త ఏడాదికి ముందు రాహుల్ విదేశీ పర్యటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఇటీవలే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చనిపోయారు. కేంద్ర ప్రభుత్వం ఏడు రోజులు సంతాప దినాలు ప్రకటించింది.
దేశ రాజధాని ఢిల్లీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే అధికార పార్టీ ఆప్ ఎన్నికల ప్రచారం ప్రారంభించింది. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలుస్తున్నారు.
మన్మోహన్ సింగ్ మరణానంతరం పలు అంశాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య వివాదం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీపై బీజేపీ విరుచుకుపడింది. మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఒకవైపు దేశం మొత్తం సంతాపం వ్యక్తం చేస్తోందని బీజేపీ పేర్కొంది. మరోవైపు రాహుల్ గాంధీ నూతన సంవత్సర వేడుకల కోసం వియత్నాం వెళ్లారని ఆరోపించింది. మన్మోహన్ సింగ్ చితాభస్మ నిమజ్జనానికి కాంగ్రెస్, గాంధీ కుటుంబానికి చెందిన వారు ఎవరూ హాజరు కాలేదని బీజేపీ విమర్శించింది.
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణానంతరం అంత్యక్రియలు, స్మారకాల విషయంలో రాజకీయాలు మొదలయ్యాయి. ఈ అంశంపై పీవీ నరసింహారావు సోదరుడు మనోహర్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పీవీ నరసింహారావుకు కనీస మర్యాద కూడా ఇవ్వలేదన్నారు. ఢిల్లీలోనే ఆయన అంత్యక్రియలు నిర్వహించి స్మారక చిహ్నం నిర్మించాలని ఆయన కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారని గుర్తు చేశారు.