Arvind Kejriwal: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళా ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరో హామీ ఇచ్చారు. ఢిల్లీలో మరోసారి అధికారంలోకి రాగానే మంచి నీటి బిల్లులను మాఫీ చేస్తామని తెలిపారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక... ప్రజావాణి పేరుతో ప్రజల సమస్యలపై దరఖాస్తులను స్వీకరించింది. పీసీసీ చీఫ్‌గా మహేష్ గౌడ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా ఇదే అనవాయితీ కొనసాగింది. గాంధీభవన్‌లో వారానికి రెండు రోజులు మంత్రులు వచ్చి...ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించాలని నిర్ణయించారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల ఫీవర్ వచ్చేసింది. త్వరలోనే హస్తినలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇదిలా ఉంటే అధికార పార్టీ ఆప్ ఇప్పటికే అభ్యర్థుల జాబితాను ప్రకటించడం.. ప్రచారంలో కూడా దూసుకుపోతోంది. ఇంకోవైపు బీజేపీ, కాంగ్రెస్ కూడా వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.
Kerala political Murders: ఐదేళ్ల క్రితం కేరళలో జరిగిన రాజకీయ హత్యలు సంచలనంగా మారాయి. అయితే, ఈ కేసులో నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు డబుల్ యావజ్జీవ శిక్షని విధించింది. 2019లో సీపీఎం-కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణల్లో ఇద్దరు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలైన శరత్లాల్ పీకే (24), కృపేశ్ (19)ల హత్య జరిగింది.
Shabbir Ali : ఫార్ములా ఈ రేస్ కేసుపై కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ రోజుకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. అరవింద్‌కి డబ్బులు బదిలీ చేయమని తానే చెప్పానని, కోర్టులో మాత్రం తనకేం సంబంధం లేదని చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగా కేటీఆర్‌కి నీతి లేదు అని ఆయన తీవ్రంగా…
హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద జాగృతి ఆధ్వర్యంలో బీసీ సభ నిర్వహించారు. ముఖ్య అతిధిగా జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. 80 బీసీ సంఘాల నాయకులు కూడా సభకు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్లు యధావిధిగా అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాటలకు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య స్పందించారు. నీది నాలుక తాటి మట్ట.. అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పది సంవత్సరాలు కేసీఆర్ కుటుంబంతో కూడి పొగిడిన వ్యక్తివి నువ్వు కాదా అని దుయ్యబట్టారు. అవకాశవాది నుంచి అవినీతి మాట రావడం సిగ్గుచేటు అని అన్నారు. కుట్రలు, కుతంత్రాలు చేస్తున్న రేవంత్ రెడ్డి సానుభూతి పొందడానికే తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని రాజయ్య అన్నారు.
పాన్ ఇండియా స్టార్ పుష్ప (అల్లు అర్జున్) అరెస్ట్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాన్ ఇండియా సీఎం అయ్యారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. RRR అలైన్మెంట్ మార్చి రైతులను మోసం చేయాలని బీఆర్ఎస్ ప్లాన్ చేసిందని ఎంపీ దుయ్యబట్టారు. RRR విషయంలో దోచుకునే, దాచుకునే అలవాటు కాంగ్రెస్ పార్టీకి లేదని అభిప్రాయపడ్డారు.
రైతు భరోసాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసాపై ఈరోజు సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పంట పండించే ప్రతీ రైతుకు రైతు భరోసా ఇవ్వాలని చర్చించారు.
Ponnam Prabhakar : త్వరలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా, ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరాలనే సంకల్పంతో, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని ఆయన సూచించారు. గురువారం, సిద్ధిపేట జిల్లాలోని కోహెడ్ లో పర్యటించిన ఆయన, అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమావేశమై మాట్లాడారు. ఈ సమావేశంలో, లోకల్ బాడీ ఎలక్షన్ల కోసం ప్రస్తుతం నుంచే పార్టీ నాయకులు వ్యూహాత్మకంగా…