CM Revanth Reddy: కుల గణన సర్వేపై సీఎం రేవంత్ సమీక్ష.. త్వరలోనే కేబినెట్ సబ్ కమిటీకి నివేదిక!
- సమగ్ర కుల గణన సర్వేపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..
- సమగ్ర కులగణన సర్వే ముసాయిదా సిద్ధం చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఫిబ్రవరి 2వ తేదీన కేబినెట్ సబ్ కమిటీకి నివేదిక ఇస్తామని తెలిపిన అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో విజయవంతంగా పూర్తి చేసిన సమగ్ర కుల గణన సర్వేపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర కులగణన ద్వారా ఇంటింటికి వెళ్లి సర్వే చేసి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందని సీఎం అన్నారు. జాతీయ స్థాయిలో తెలంగాణ సర్కార్ చేపట్టిన సర్వేపై ప్రశంసలు అందుతున్నాయని చెప్పుకొచ్చారు. సర్వే విజయవంతంగా చేపట్టిన అధికారులను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు. సర్వేకు సంబంధించిన ముసాయిదా సిద్దమయిందని.. ఒకటి రెండు రోజుల్లో సమర్పిస్తామని అధికారులు తెలిపారు. అయితే, పూర్తి నివేదికను మాత్రం ఫిబ్రవరి 2వ తేదీ లోగా కేబినెట్ సబ్ కమిటీకి అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారులు చెప్పారు.
Read Also: Minister Kolusu Parthasarathy: వైసీపీ ఖాళీ అవుతోంది.. నంబర్ 2లు కూడా వెళ్లిపోయారు.
Also Read
అయితే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు పలు కీలక శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే, పంచాయతీ రాజ్ శాఖపై సమీక్షించిన సీఎం.. ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు పర్యాటక శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అలాగే, సాయంత్రం 6 గంటలకు దేవాదాయ శాఖపై సమీక్ష చేయనున్నారు. ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖతో పాటు సంబంధిత శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొనే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
-
OTR: నెలకు ₹2,000 కోట్లు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదేనా?
-
US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!