ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. వాస్తవానికి సోమవారమే నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది. భారీ ర్యాలీగా వెళ్లడంతో సమయం దాటిపోయింది.
Gangula Kamalakar : నిన్న జరిగిన అధికారిక సమావేశంలో ముగ్గురు మంత్రులు ఉండి కూడా ఫెయిల్ అయ్యారని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇవాళ ఆయన కరీంనగర్ జిల్లాలో మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక ఎమ్మెల్యేను ముగ్గురు మంత్రుల ముందు లాక్కుపోవడం దుర్మార్గమైన చర్య అని ఆయన విమర్శించారు. జిల్లా ఇంచార్జీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్నటి మీటింగ్ లో ఫెయిల్ అయ్యారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీస్ రాజ్యం…
Bhatti Vikramarka: ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం కోసం దేశంలో ఎక్కడ కూడా తెలంగాణలో ఉన్నటువంటి వంటి పథకాలు లేవు అన్నారు.
త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యటనలు ఉంటాయని తెలిపారు. అక్రమాలు జరుగకుండా చూడాలన్నారు. భవనాలు ఉన్న వారికి ఇళ్లు ఇస్తే మొదటి బాధ్యులు కలెక్టర్ అవుతారు.. అర్హులైన వారికి ఇళ్లు రావాలన్నారు. అధికారులు, సిబ్బంది కీలక పాత్ర వహించాల్సి వుంటుంది.. అధికారులు, సిబ్బంది అలసత్వం ఉండొద్దు.. గ్రామాలు మీ ఇళ్లు అనుకుని పని చేయండి అని మంత్రి సూచించారు.
మంత్రి పొన్నం మాట్లాడుతూ.. అందరికీ భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సీజన్ లో కూడా మంచి పుష్కలమైన వర్షాలు పడి ఆయుఆరోగ్యాలతో పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో తెలంగాణ సమాజం బాగుండాలని రాజన్న స్వామిని మొక్కుకున్న.. రైతంగా బాగుంటేనే అందరూ బాగుంటారు.. దక్షిణ కాశీ వేములవాడ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలు కార్యక్రమాలను ప్రారంభించారు.
బీర్లకు, బార్లలో ఖర్చు చేస్తున్నారు.. కానీ ప్రాణానికి రక్షణనిచ్చే హెల్మెట్ కోసం మాత్రం ఖర్చు చేయడం లేదని వాపోయారు. జిల్లాలో గత ఏడాదిలో 213 మంది చనిపోయారు.. మనతో పాటు మనల్ని నమ్ముకున్న వాళ్లు ఉంటారు.. అందుకే రోడ్డు భద్రత ప్రతి ఒక్కరు పాటించాలని మంత్రి సీతక్క తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్లు అంటేనే కాంగ్రెస్ గుర్తుకు వస్తోంది అని ఆయన తెలిపారు. ఇక, ధనిక రాష్ట్రాన్ని గత ప్రభుత్వం కొల్ల కొట్టింది అని ఆరోపించారు. పేదవాడు ఇబ్బందులు పడవద్దని ఇందిరమ్మ ప్రభుత్వ ఆలోచన.. అందుకే ఇందిరమ్మ ఇళ్ల మీద ప్రభుత్వం శ్రద్ధ చూపిస్తుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు.
Kaushik Reddy: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు షాక్ ఇచ్చారు. ఆయనపై మూడు కేసులు నమోదు చేశారు. పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Manda Jagannatham : మాజీ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ మందా జగన్నాథం (73) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన కుటుంబంలో భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 1996లో తెలుగు దేశం పార్టీలో చేరిన ఆయన, మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. అనంతరం వరుసగా 1996, 1999, 2004, 2009 ఎన్నికల్లో విజయం సాధించి…
తాను ఏది మాట్లాడినా సెన్సేషన్ అవుతుందని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఫార్ములా ఈ కార్ రేసు వల్ల హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందని ఆయన చెప్పారు. కానీ అవినీతి కాలేదని తాను చెప్పలేదన్నారు.