KTR: బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు ఉప ఎన్నికలకు రెడీగా ఉండాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు ఎక్స్(ట్విటర్) వేదికగా ట్వీట్ చేశారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులు చూస్తుంటే పార్టీ మారిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పైనా వేటు పడుతుందన్నారు. అలాగే, ఫిరాయింపుదారులను కాంగ్రెస్ పార్టీ కాపాడడం అసాధ్యమన్నారు. అయితే, తెలంగాణ పార్టీ మారిన ఎమ్మెల్యే వ్యవహారంలో కేటీఆర్ వేసిన పిటిషన్ విచారణ సోమవారం నాటికి వాయిదా పడింది. గతంలో ఇదే వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌లతో కలిపి విచారిస్తామని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం వెల్లడించింది.
Read Also: January 2025 Sales: జనవరిలో దుమ్ములేపిన మారుతి సుజుకి, కియా, టయోటా
ఇక, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కాలయాపన చేస్తున్నారని సుప్రీంకోర్టులో కేటీఆర్ జనవరి 29న రిట్ పిటిషన్ దాఖలు చేశారు. స్పీకర్ వెంటనే అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. అలాగే, ఫిరాయింపులపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై కూడా విచారణ కొనసాగుతుంది. ఈ క్రమంలో.. ఈ రెండు పిటిషన్లను కలిపి ఈ నెల 10వ తేదీన విచారిస్తామని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం వెల్లడించింది. ఈ నేపథ్యంలో పార్టీ మారిన వారిపై వేటు పడటం ఖాయమని, ఉప ఎన్నికలకు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు సిద్ధం కావాలని ఈ సందర్భంగా కేటీఆర్ పిలుపునిచ్చారు.
Read Also: CPM: సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా శ్రీనివాసరావు తిరిగి ఎన్నిక..
అయితే, బీఆర్‌ఎస్ పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకటరావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలె యాదయ్య, ప్రకాష్ గౌడ్ , అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్‌లు కాంగ్రెస్‌లోకి పార్టీలో చేరారు. వీళ్లపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు.
It is impossible for Congress party to shield the defectors anymore as the Law laid down by the Constitution and prior judgements of Supreme Court are explicitly clear
Let us be prepared to fight By-elections soon my fellow @BRSparty soldiers 👍 https://t.co/owbmoq51K5
— KTR (@KTRBRS) February 3, 2025