BJP MP Laxman: ఎమ్మెల్సీ ఎన్నికల తీర్పు రేవంత్ రెడ్డి పాలనకు రెఫరెండం అని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ తెలిపారు. డబుల్ ఎమ్మెల్సీ గెలిచాం.. డబులింజన్ సర్కార్ ఖాయం అన్నారు. తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగాo.. ఎదురులేని శక్తిగా ఎదుగుతామన్నారు.
Indira Mahila Shakti: అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా రేపు పరేడ్ గ్రౌండ్ వేదికగా ఇందిరా మహిళా శక్తి మిషన్- 2025 విడుదల చేయనున్నారు. ఈ ఏడాది మహిళా స్వయం సహాయక బృందాల విజయాలతో పాటు భవిష్యత్త్ కర్తవ్యాలను నిర్దేశిస్తూ ఇందిరా మహిళ శక్తి మిషన్ - 2025..
లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ శుక్రవారం గుజరాత్లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు అహ్మదాబాద్లోని రాజీవ్ గాంధీ భవన్లోని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమావేశం జరగనుంది. మాజీ పీసీసీ అధ్యక్షులు, గుజరాత్ పీసీసీ సీనియర్ నాయకులతో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు.
CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు (మార్చ్ 7) ఢిల్లీకి వెళ్తున్నారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కూడా వెళ్లబోతున్నారు.
తెలంగాణ కేబినెట్లో బెర్త్ కోసం ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలు తొక్కని గడప లేదు... మొక్కని దేవుడు లేడు అన్నట్లుగా ఉందట వ్యవహారం. మంత్రి పదవుల కోసం ఎవరి వ్యూహాల్లో వారు మునిగి తేలుతున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ కాంగ్రెస్లో కయ్యం ముదురుతోందట. తాజాగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమక్షంలో మీటింగ్ గరగరంగా సాగినట్టు తెలిసింది.నేతల వ్యవహార శైలిపై ఫిర్యాదుల వెల్లువలా వచ్చినట్టు తెలిసింది.ఆమె ముందే పరస్పరం కౌంటర్స్ వేసుకున్నారట నాయకులు. పక్క జిల్లాకు చెందిన నేత ఒకరు పార్టీని కులాల వారిగా విభజిస్తున్నారని, జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చీలిపోవడం ,గ్రూప్ లుగా మారడానికి సదరు నేతే కారణమని ముందు పేరు చెప్పకుండా ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.
గెలుపునకు మేమందరం బాధ్యత తీసుకున్నాం.. ఓటమి కూడా సమిష్టి బాధ్యత అని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. బీజేపీ- బీఆర్ఎస్ పార్టీల చీకటి ఒప్పందంలో భాగంగా బీఆర్ఎస్ పూర్తిగా బీజేపీ అభ్యర్థులకు సపోర్ట్ చేసిందని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ హవా చూపిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ సభ్యుల ఓటమిపై ఎంపీ మల్లు రవి ఢిల్లీలో మాట్లాడారు.
CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, ఢిల్లీ పర్యటన తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి ఇంటికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లారు. త్వరలో కేబినెట్ విస్తరణ ఊహాగానాలతో ఈ సమావేశానికి ప్రాధాన్యత నెలకొంది.
Jagga Reddy: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈరోజు ఢిల్లీకి పయనం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను ఎమ్మెల్సీ అడుగుతలేను.. నేను అడగొద్దు కూడా అన్నారు.
MLC Kavitha: కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీలు గెలిచాయి.. ప్రజాస్వామ్యం ఓడిపోయింది అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలో బీసీయేతర అభ్యర్థులను బరిలోకి దింపింది అన్నారు. పార్టీలపరంగా, సిద్ధాంత పరంగా ఓట్లు చీలాయి.. కాబట్టి పోటీలో ఉన్న బీసీ అభ్యర్థి గెలవలేదు అని పేర్కొన్నారు.