రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈనెల 6 నుంచి నిర్వహించే పదవ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలను మధ్యాహ్నం 12.15 నుంచి 3.15 గంటలకు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయం సమంజసం కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. "ఈ సమయంలో విద్యార్థులు, అధ్యాపకులు సహా ప్రతి ఒక్కరూ లంచ్ చేస్తారు. అదే టైంకి పరీక్షలు నిర్వహించి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదు. రంజాన్ సందర్భంగా ముస్లింలకు సాయంత్రం 4…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత వారం రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి బీజేపీపై.. వ్యక్తిగతంగా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పలువురు కార్యకర్తలు పార్టీలో చేరారు. ఈ సందర్బంగా వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఉప ఎన్నికలు వస్తాయని అన్నారు.
వరంగల్ మామునూర్ ఎయిర్‌పోర్టు ప్రాంగణం దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కార్యకర్తల మద్య తోపులాట జరిగింది. మామునూరు ఎయిర్ పోర్ట్‌కు ఆమోదం రావడంతో కాంగ్రెస్, బీజేపీ ఆధ్వర్యంలో వేరువేరుగా సంబరాలు చేసుకుంటున్నారు.
BJP: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యవహారం కాంగ్రెస్‌లో కాకరేపుతోంది. ఆయన బీజేపీకి చేరుతారంటూ ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వాదనల్ని డీకే శివకుమార్ కొట్టిపారేసినప్పటికీ, సొంత పార్టీలోని కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఇటీవల ఆయన మహా కుంభమేళాకు వెళ్లడం, శివరాత్రి రోజున కోయంబత్తూర్‌లో మతపరమైన కార్యక్రమానికి హాజరుకావడంతో బీజేపీకి దగ్గరవుతున్నారనే వాదన వినిపిస్తోంది.
CM Revanth Reddy: గాంధీ భవన్ లో జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో కాంగ్రెస్ కొత్త ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడ్డ వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుంది అని తెలిపారు.
Himachal: నిధుల లేమితో ఇబ్బందులు పడుతున్న హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీజేపీ ఆరోపణలు గుప్పిస్తోంది. రాష్ట్ర సంక్షేమ పథకాల కోసం ఆలయ ట్రస్టుల నుంచి నిధులు కోరుతోందని ఆరోపించింది. అయితే, దీనిపై ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు మాట్లాడుతూ, ఈ విరాళం స్వచ్ఛందంగా అందించబడిందని, ఇది సుఖ్ ఆశ్రయ్ పథకం కింద అనాథలకు భవన నిర్మాణ సౌకర్యాల కోసం అని చెప్పారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 9 పేజీల బహిరంగ లేఖ రాశారు. కేంద్రానికి తెలంగాణ విజ్ఞప్తులను సీఎం లేఖలో ప్రస్తావించారు. తెలంగాణ అభ్యర్థనలను కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. బెంగళూరు, చెన్నై మెట్రో ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చిన కేంద్రం.. హైదరాబాద్ మెట్రో విస్తరణ విషయంలో నిర్లక్ష్యం చేస్తోందన్నారు. కీలక ప్రాజెక్టులకు కేంద్రం అనుమతుల కోసం రాష్ట్రం ఎదురుచూస్తోందని అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి నిధులు మంజూరు చేయించడం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి…
ఎస్ఎల్బీసీ టన్నెల్‌ను గత ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేదు? అని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. 2014 నుండి 2023 వరకు 200 కిలోమీటర్ల టన్నెల్ పనులు చేశాం అని హరీశ్ రావు అంటున్నారు, పదేళ్లలో మిగిలిన 19 కిమీ ఎందుకు తవ్వలేక పోయారన్నారు. హరీశ్ రావు సొల్లు పురాణం మాటలు మస్తు చెప్తాడని ఎద్దేవా చేశారు. అడిగిన దానికి తప్ప.. అన్నిటికి హరీశ్ రావు స్పందిస్తారని విమర్శించారు. ప్రమాదం జరగగానే హరీష్ రావు ఎందుకు రాలేదు?…
శివరాత్రి వేడుకల్లో ఇషా ఫౌండేషన్ అధినేత సద్గురు జగ్గీ వాసుదేవ్‌తో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ వేదిక పంచుకోవడం రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. సొంత పార్టీ నేతల నుంచి డీకే.శివకుమార్‌పై తీవ్ర వ్యతిరేక వ్యక్తమైంది.