ఇటీవల గాంధీభవన్‌లో మహిళా కాంగ్రెస్ నేతల సమావేశంలో రసాభాస చోటుచేసుకుంది. మహిళా నేతలు సునీతరావు, కవిత మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే ఇరువురు బూతులు తిట్టుకున్నారు. అనంతరం సమావేశంలో నుంచి కవిత బయటకు వెళ్లిపోయింది. ఈ ఘటన ప్రస్తుతం కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన బహిర్గతం కావడంతో పార్టీ ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకొని క్రమ శిక్షణ చర్యల కింద కవితను ఆమె పదవి నుంచి తొలగిస్తున్నట్లు పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ…