నిజామాబాద్ జిల్లాకు నవోదయ విద్యాలయాన్ని మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం. కానీ... దాన్ని ఎక్కడ పెట్టాలన్న విషయంలో రాజకీయ రాద్ధాంతం నడుస్తున్నట్టు తెలిసింది. కేంద్రం మంజూరు చేసిన స్కూల్‌ను తాను సూచించిన ప్రాంతంలో ప్రారంభించమని పట్టుబడుతున్నారట నిజామాబాద్ ఎంపీ అర్వింద్. జక్రాన్ పల్లి మండలం కలిగోట్‌లో పెట్టాలంటూ... ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారట ఎంపీ.
తెలంగాణ పొలాల్లో పొలిటికల్ పేలాలు వేగుతున్నాయా? రైతుల అవసరాల చుట్టూ రాజకీయం రక్తి కడుతోంది తప్ప…. పని మాత్రం జరగడం లేదా? ఏ విషయంలో ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు ముక్కలాట ఆడుతున్నాయి? తప్పు మీదంటే మీదేనని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు పరస్పరం నెపం నెట్టుకుంటున్నాయి? రైతుల చుట్టూ జరుగుతున్న రాజకీయం ఏంటి? తెలంగాణలో పొలాలకు వేసే ఎరువులు పొలిటికల్ కలర్ పులుముకుంటున్నాయి. రైతులకు సరిపడా సరఫరా సంగతి ఎలా ఉన్నా… రాజకీయ…
MLC Elections : కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టబద్రులు, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ప్రచారం ముగిసింది. ఈనెల 27 న టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. గత 15 రోజులుగా ప్రచారాన్ని హోరెత్తించారు అభ్యర్థులు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు దూరంగా ఉంది. పట్టభద్రుల స్థానంలో బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ అభ్యర్థుల మధ్య ట్రయాంగిల్ వార్ జరుగనుంది. బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థుల తరుఫున ప్రచారం చేశారు పార్టీ అగ్రనేతలు.. కాంగ్రెస్ అభ్యర్థికి…
Kishan Reddy : యాదాద్రి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరిలో మీట్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మూడు ఎమ్మెల్సీ స్థానాలను బీజేపీ గెలుచుకుందన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఓటు అడిగే ధైర్యం లేకనే తమ అభ్యర్థులను బరిలోకి దింపలేదన్నారు కిషన్…
Bandi Sanjay : హైదరాబాద్ లోని మెర్క్యురీ హోటల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. ఈసారి కేంద్ర బడ్జెట్ లో పన్నులు, పథకాల రూపంలో తెలంగాణకు రూ.1.08 లక్షల కోట్లు కేటాయించామన్నారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందనడం పచ్చి అబద్దమని, కళ్లుండి చూడలేని, చెవులుండి వినలేని కబోధులు కాంగ్రెస్ నేతలు అని ఆయన విమర్శించారు. 6 గ్యారంటీలపై డైవర్ట్ చేయడానికే కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని, బీఆర్ఎస్ బాటలోనే…
MP K.Laxman : కరోనా లాంటి గడ్డు పరిస్థితి నుంచి కఠిన నిర్ణయాలు తీసుకుని ఆర్థిక వ్యవస్థను ప్రధాని మోడీ గాడిలో పెట్టారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఇవాళ ఆయన రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. 2014లో 2 లక్షలకు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటే ఇప్పుడు ఏకంగా 12 లక్షల వరకు మినహాయింపు ఇచ్చారన్నారు. ఇదొక మైల్ స్టోన్ అని, దశాబ్ద కాలంలో ప్రధాని మోడీ ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. ఆర్థికంగా ఎంత…
హిమాచల్‌ప్రదేశ్ రాజకీయాలను సమోసాల వివాదం ఇంకా కుదిపేస్తోంది. అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల-తూటాలు పేలుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖుకి బీజేపీ ఎమ్మెల్యే 11 సమోసాలను ఆన్లైన్ ఆర్డర్ చేశారు. దీంతో ఈ వివాదం మరింత ముదురుతున్నట్లుగా కనిపిస్తోంది.
JP Nadda: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ కేంద్రంగా కాంగ్రెస్- బీజేపీల మధ్య వివాదం ముదురుతుంది. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా రాసిన లేఖలో మోడీని విమర్శిస్తే మల్లికార్జున ఖర్గే ఎందుకు మాట్లాడ్డం లేదు అని ప్రశ్నించారు.
NDA : జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) పార్లమెంటరీ పార్టీ సమావేశం మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగింది. మూడోసారి ప్రధాని అయిన తర్వాత పార్లమెంటు తొలి సెషన్లో అధికార పార్టీ ఎంపీలతో ఆయన మాట్లాడటం ఇదే తొలిసారి.
Rahul Gandhi : లోక్‌సభ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ దూకుడుగా ఉన్నట్లు కనిపిస్తోంది. నిన్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఈ లోక్ సభ ఎన్నికల్లో తొలిసారిగా హర్యానాలో భారీ ర్యాలీలు నిర్వహించి తన వైఖరిని చాటుకున్నారు.