కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో రాత్రి 8 గంటలకు ఇండియా కూటమి ఫ్లోర్ లీడర్లు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ఇదిలా ఉంటే సోమవారం నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి.
CWC Meeting : లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) తొలిసారి ఈరోజు సమావేశమైంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఎన్నికల ఫలితాలను సమీక్షించడంతోపాటు భవిష్యత్తు వ్యూహంపై చర్చించారు.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు తర్వాత రెండు కూటమిల మధ్య ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్డీఏ, ఇండియా కూటమిలు దెబ్బ దెబ్బగా సీట్లు సాధించాయి. బీజేపీ సొంతంగా ఎక్కువ సీట్లు సాధించకపోయినా.. మిత్ర పక్షాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు.
దేశ రాజధాని ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశం అయింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో భారత కూటమి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి కూటమిలో ఉన్న పార్టీ అధినేతలు, నాయకులు పాల్గొన్నారు.
సార్వత్రిక ఎన్నికల వేళ అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం హోరాహోరీగా సాగుతోంది. విమర్శలు-ప్రతివిమర్శలతో ఎన్నికల ప్రచారాన్ని హీటెక్కిస్తున్నారు. బీజేపీ.. కాంగ్రెస్ లక్షంగా మాటల తూటాలు పేలుస్తోంది.
రూ.100 కోట్ల పరువు నష్టం కేసులో మల్లికార్జున్ ఖర్గేకు పంజాబ్ కోర్టు సమన్లు జారీ చేసింది. జులై 10న కోర్టు ముందు హాజరు కావాలని సంగ్రూర్ జిల్లా కోర్టు ఖర్గేకు సమన్లు పంపింది. కాగా ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ విశ్వహిందూ పరిషత్ యువజన విభాగమైన బజరంగ్ దళ్‌ను బ్యాన్ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
అదానీ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ జరిపించాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌పై దృష్టి మళ్లించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్య సూత్రాలపై నడుచుకోవడం లేదని, పార్లమెంటులో అంతరాయాలకు కారణమైందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు.
బీజేపీకి వ్యతిరేకంగా దేశంలోని విపక్షాలు ఏకం అవుతున్నాయి. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం, దేశంలో ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కడంపై బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంగళవారం కూడా తమ ‘నల్ల’ నిరసనను కొనసాగించాలని ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించుకున్నాయి.
కాంగ్రెస్ కొత్త సారథిగా మల్లికార్జున ఖర్గే ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్న స సోనియా గాంధీ నుంచి ఖర్గే బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు.