పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఇక రాజ్యసభ్య ఛైర్మన్‌గా తొలిసారి సీపీ.రాధాకృష్ణన్ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడారు.
బీహార్‌లో రెండో విడత పోలింగ్ కోసం ఉధృతంగా ప్రచారం సాగుతోంది. అన్ని పార్టీలకు చెందిన అగ్ర నాయకులంతా ర్యాలీలు, బహిరంగ సభలతో జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ఓ వైపు ప్రధాని మోడీ, అమిత్ షా, కేంద్రమంత్రులు ప్రచారం చేస్తుండగా.. ఇంకోవైపు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, మల్లిఖార్జున ఖర్గే లాంటి అగ్ర నేతలంతా ప్రచారం చేస్తున్నారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (83)కు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. ఖర్గే ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు మల్లిఖార్జున ఖర్గేకు ఫోన్ చేసినట్లుగా ప్రధాని మోడీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఖర్గే త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. ఈ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి సరైన పరిహారం అందించాలన్నారు. ఖర్గే అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిని సందర్శించి గాయపడిన వారిని పరామర్శించారు.
ప్రధాని మోడీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే లేఖ రాశారు. పార్లమెంట్ ఉభయ సభల ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని లేఖలో కాంగ్రెస్ అధ్యక్షుడు కోరారు.
కేంద్ర బడ్జెట్‌పై విపక్షాలు పదవి విరిచాయి. ఎన్డీఏ మిత్రపక్షాలు మాత్రం ప్రశంసలు కురిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే మాత్రం బడ్జెట్‌ను తప్పుపట్టారు.
ఎన్నికల విధానం, ప్రక్రియ పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకం నెమ్మదిగా సన్నగిల్లుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అన్నారు. కర్ణాటకలోని బెళగావిలో సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతున్నాయి.
హర్యానాలో ఎదురైన పరిస్థితులు మహారాష్ట్ర, జార్ఖండ్‌లో ఎదురవ్వకూడదని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఇంకా షెడ్యూల్ రాక ముందే మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పరిశీలకులను అధిష్టానం నియమించింది.
హర్యానా ఎన్నికల ఫలితాలను అంగీకరించబోమని కాంగ్రెస్ ప్రకటించింది. ఫలితాలను తారుమారు చేశారంటూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సీనియర్ నేత జైరాం రమేష్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారు. ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేస్తామని వ్యాఖ్యానించారు.