ఏఐసీసీ అధ్యక్ష పదవి ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన మల్లికార్జున్ ఖర్గే.. నేడు ఆ బాధ్యతలు చేపట్టనున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు సోమవారం జరగనున్నాయి. పార్టీ అధ్యక్ష పదవి కోసం కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, శశథరూర్‌కు మధ్య గట్టి పోటీ జరగనుంది.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్.. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. పార్టీ అధ్యక్షుడినైతే ఏం చేస్తాననే విషయంపై మేనిఫెస్టో తయారు చేసి విడుదల చేశారు.. పార్టీలో మేమందరం ఒక్కటేనని, తమకు సిద్ధాంత వైరుధ్యాలు లేవని స్పష్టం చేసిన ఆయన.. బీజేపీని ఎలా ఎదుర్కోవాలనే అంశంపైనే తమ చర్చ అన్నారు. అధ్యక్ష ఎన్నికపై కాంగ్రెస్ ఫ్యామిలీలో అంతర్గత చర్చ జరుగుతోందన్నారు. హైదరబాద్‌లో కొందరిని…
కాంగ్రెస్ సీనియర్ నేత, కేరళ ఎంపీ శశి థరూర్, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే, జార్ఖండ్ కాంగ్రెస్ నాయకుడు కేఎన్ త్రిపాఠి శుక్రవారం ఆ పార్టీ అధ్యక్ష పదవి కోసం జరుగుతున్న ఎన్నికల్లో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
తన సొంత గడ్డపై సమస్య తలెత్తడంతో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయడాన్ని వాయిదా వేసే అవకాశం ఉందని పలు వర్గాలు తెలిపాయి.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు నామినేషన్ వేయడానికి ముందే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
కాంగ్రెస్ నాయకత్వాన్ని కుదిపేసిన జీ-23లో ఒకరైన తిరువనంతపురం ఎంపీ శశి థరూర్... పార్టీలో సంస్కరణల గురించి ఇటీవల ప్రస్తావించారు. వచ్చే నెల జరగనున్న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనేందుకు శశి థరూర్ సుముఖంగా ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
రాహుల్‌గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండాలని బలవంతంగా ఒప్పించలేమని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టడం రాహుల్ గాంధీకి ఇష్టం లేకపోతే.. ఆ పదవి చేపట్టేలా ఆయనను బలవంతం చేయలేమని ఆయన అభిప్రాయపడ్డారు.