Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న‘ భారత్ జోడో యాత్ర’ విమర్శలు, వివాదాలకు కేంద్రంగా నిలుస్తోంది. రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్రపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా రాహుల్ గాంధీ మరో వివాదంలో ఇరుక్కున్నారు. యాత్రలో పిల్లలను రాజకీయ సాధనాలుగా దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలపై రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీలపై చర్యలు తీసుకోవాలని.. విచారణ ప్రారంభించాలని అత్యున్నత బాలల హక్కుల సంఘం (ఎన్సీపీసీఆర్) ఎన్నికల సంఘాన్ని కోరింది.
Congress is finished in Gujarat, says Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని అన్నారు. గుజరాత్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గుజరాత్ రాష్ట్రంలో పర్యటిస్తున్న ఆయన అహ్మదాబాద్ నగరంలో పారిశుద్ధ్య కార్మికులతో సమావేశం అయిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
Rahul Gandhi get a marriage proposal during Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ ను దేశవ్యాప్తంగా బలోపేతం చేసే పనిలో ఉన్నారు రాహుల్ గాంధీ. తమిళనాడులో మొదలైన రాహుల్ యాత్ర.. నిన్న రాత్రి కేరళకు చేరింది. పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలతో మమేకం అవుతున్నారు.
Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ తమిళనాడులో కొనసాగుతోంది. సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారు. ప్రస్తుతం ఆయన యాత్ర నాలుగో రోజుకు చేరుకుంది. నాలుగో రోజు యాత్రలో రాహుల్ గాంధీ స్వల్ప విరామం తీసుకున్నారు. ఉదయం 7 గంటలకు మూలగం నుంచి ప్రారంభం అయిన రాహుల్ గాంధీ యాత్ర 13 కిలోమీటర్ల పాటు సాగింది. దీని తరువాత స్వల్ప విరామం తీసుకుని సాయంత్రం 4…
ఇదిలా ఉంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా సరికొత్త అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది. రాహుల్ గాంధీ ధరించిన టీషర్టుపై బీజేపీ విమర్శలు చేస్తోంది. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ధరించిన టీషర్టు ధర రూ. 41,000 కన్నా ఎక్కువ అని బీజేపీ విమర్శలు చేస్తోంది. భారతదేశమా చూడండి అంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తోంది. ‘‘ భారత్, దేఖో’’ అంటూ రాహుల్ గాంధీ ఫోటోతో పాటు, అతను ధరించిన టీషర్టు ఫోటోలను జతచేసి…