రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో ఈ నెల 26న ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సభను విజయవంతం చేయండి అని తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే అన్నారు. ఆయన ఇవాళ ( గురువారం ) చేవెళ్ల సభాస్థలిని పరిశీలించారు. చేవెళ్ల మండల కేంద్రంలోని కొండా విశ్వేశ్వర్ రెడ్డి గ్రౌండ్లో ఈనెల 26న ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ బహిరంగ సభ జరగబోతుంది. ఈ మీటింగ్ కు ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గేను ముఖ్య అతిథిగా ఆహ్వానించామని ఆయన అన్నారు.
Read Also: Kareena Kapoor: కరీనా కపూర్ వేసుకున్న ఈ డ్రెస్సు ధర ఎంతో తెలుసా?
ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాణిక్ రావు ఠాక్రే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రములో అన్ని వర్గాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ మాదిరిగానే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ చేయడానికి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జునా ఖర్గే 26వ తారీఖున వస్తున్నట్టు ఆయన తెలిపారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం హామీ ఇచ్చినా.. ఏ ఒక్క పథకానికి కూడా కట్టుబడి లేదు అని తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ ఠాక్రే అన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన నడుస్తుంది.. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఎందుకు తక్కువ చూపు చూస్తున్నారు అని మీడియా సమావేశంలో మాణిక్ రావు ఠాక్రే ప్నశ్నించారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని మాణిక్ రావు ఠాక్రే ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న ప్రతి ఒక్క హామీని నెరవేర్చుతుందని ఆయన వెల్లడించారు. ప్రజలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని ఠాక్రే పేర్కొన్నారు.
Read Also: Sea lamprey: ఏంటీ ఈ వింత జీవి.. ఇంత ఘోరంగా ఉంది..!