హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారంపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో బీజేపీకి లబ్ది చేకూర్చేందుకు బీఆర్ఎస్ కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. బీజేపీకి బీ టీంగా బీఆర్ఎస్ పనిచేస్తోందని మంత్రి ఆరోపించారు.
Addanki Dayakar: ఎన్నికల్లో 100 శాతం మనమే అధికారంలోకి వస్తామని మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ స్పందించారు. కేసీఆర్ పగటి కలలు కంటున్నారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే సమన్వయ, పర్యవేక్షణ అధికారులను నియమించింది ప్రభుత్వం. జీహెచ్ఎంసీ పరిధిలో సర్వే సమన్వయ అధికారిగా హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను నియమించారు. సికింద్రాబాద్, చార్మినార్ జోన్‌లకు హెచ్‌ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ శ్రీవత్స కోట.. ఎల్బీనగర్, ఖైరతాబాద్ జోన్‌లకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఉప కార్యదర్శి ప్రియాంక.. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి జోన్‌లకు జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మయాంక్ మిట్టల్‌ను నియమించారు.
యాదాద్రి జిల్లాలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటిస్తున్నారు. పోచంపల్లి మండలం గౌస్ కొండ, రేవనపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడి.. కొనుగోలు ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు కిషన్ రెడ్డికి తమ సమస్యలు చెప్పుకున్నారు. కొనుగోలు ప్రక్రియ ఆలస్యం అవుతుంది.. హమాలీల కొరత ఉంది.. ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యం కల్పించడం లేదు.. బస్తాలు, తర్పలిన్, సూతిల్ కూడా లేవని కిషన్ రెడ్డికి రైతులు చెప్పారు.
Samagra Kutumba Survey: రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వేలో నేడు అసలు ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి దశలో (బుధవారం) నుంచి మూడు రోజులుగా కుటుంబాలను గుర్తించి సిబ్బంది ఇళ్లకు ఎన్యూమరేటర్లు స్టిక్కర్లు వేశారు.
Keshavapuram Reservoir: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గోదావరి ఫేజ్ 2లో భాగంగా హైదరాబాద్ శివార్లలో గత ప్రభుత్వం తలపెట్టిన కేశవాపురం రిజర్వాయర్ పనులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది.
KTR Tweet: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్లంలో కాంటా ఎప్పుడు వేస్తారో తెలియక కన్నీరు పెడుతున్న రైతన్నల కన్నీళ్ల వైపు చూడు అంటూ మండిపడ్డారు.
Hyderabad: ఇందిరా పార్క్‌లో ఆటో డ్రైవర్ల మహాధర్నా కార్యక్రమం కొనసాగుతుంది. రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చిన ఫ్రీ బస్సు కారణంగా నష్టపోతున్న ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆటో, ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ జేఏసీ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహిస్తున్నారు.