Ramchander Rao : తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, రాజ్యాంగ నియమాలను ఉల్లంఘిస్తోందని ఆయన ఆరోపించారు. రామచందర్ రావు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, “మైక్ కూడా ప్రభుత్వంలాగే పనిచేస్తున్నట్టు ఉంది, అప్పుడప్పుడు చెప్పినట్టు వినదు” అంటూ చురకలు అంటించారు. ఆయన చేసిన ప్రధాన వ్యాఖ్యలు:
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జరిగిన క్రాస్ ఓటింగ్‌ను చూస్తే ఇండియా కూటమిలో ఐక్యత లేదని తేలిపోయిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినంత రాజ్యాంగ అవహేళన ఎప్పుడూ జరగలేదని ఆయన విమర్శించారు. గవర్నర్ మాత్రం రెండు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు ఇస్తారని, కానీ స్పీకర్ మాత్రం పిరాయింపుల పైన నిర్ణయం తీసుకోవడానికి గడువు ఉండదా అని కాంగ్రెస్‌ను ప్రశ్నించారు.
Somireddy Chandra Mohan: అవినీతి, అక్రమాల్లో కాకాణికి డాక్టరేట్ ఇవ్వొచ్చు
యూరియా కృత్రిమ కొరతను కాంగ్రెస్ సృష్టించిందని, రాష్ట్ర ప్రభుత్వమే దీనికి కారణమని తెలంగాణ రైతులకు అర్థమైందని రామచందర్ రావు పేర్కొన్నారు. తెలంగాణకు అవసరమైన యూరియాను కేంద్రం ఎప్పుడో ఇచ్చిందని, కొద్దిగా ఆలస్యం కావొచ్చు కానీ కొరత లేదని ఆయన స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌లో కుటుంబ తగాదాలు ఉన్నాయని, కానీ బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్య తగాదా లేదని అన్నారు. ఓయూకి వెయ్యి కోట్లు ఇస్తానని సీఎం అన్నారని, కానీ ఇప్పుడు ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు కూడా రావడం లేదని ఆరోపించారు.
పార్టీలో ఎవరిపైనా వివక్ష లేదని, ఇంకా 650 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆయన చెప్పారు. పార్టీ కమిటీలో అందరికీ అవకాశం రాలేదని, వారి సేవలను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తామని అన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్‌లో పాల్గొంటే, ఉన్న నలుగురు సభ్యులు కూడా ఉంటారో లేదో అనే భయంతోనే బీఆర్‌ఎస్ ఓటింగ్‌కు దూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
OG : ఓవర్సీస్ లో OG హంటింగ్.. మరో రికార్డు నమోదు చేసిన హంగ్రీ చీతా