తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలు రోజుకో మలుపు తిరుగుతుంటాయి. నేతలు కీలక ప్రకటనలతో హోరెత్తిస్తూ వుంటారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఉంది. అలా అని హద్దు మీరితే అధిష్టానం ఊరుకోదు. గీత దాటితే వేటు తప్పదన్నారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధిష్టానంకి తెలుసు. వ్యక్తిగత సమస్యలు ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలన్నారు. పీసీసీలో ఎన్నో కమిటీలు ఉన్నాయి. ఏఐసీసీ కూడా ఉంది. ఏదైనా సమస్య ఉంటే ఏఐసీసీకి…