Rahul Gandhi: జర్మనీ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరో వివాదానికి కారణమయ్యారు. భారతదేశాన్ని అస్థిరపరచాలని భావించే జార్జ్ సోరోస్ సన్నిహితురాలు ప్రొఫఎసర్ డాక్టర్ కార్నెలియా వోల్‌ను కలిశారు. సోరోస్‌కు చెందిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్, సెంట్రల్ యూరోపియన్ యూనివర్సిటీలను ప్రస్తావిస్తూ బీజేపీ కాంగ్రెస్ నేతపై తీవ్ర విమర్శలు చేస్తోంది.
ఆ ఎంపీలు పొలిటికల్‌గా ఎందుకు యాక్టివ్ మోడ్‌లో కనిపించడం లేదు? లేనిపోని విషయాల్లో వేలుపెట్టి నెత్తి మీదికి తెచ్చుకోవడం ఎందుకని అనుకుంటున్నారా? లేక ఇతర కారణాలున్నాయా? టిక్కెట్స్ ఇచ్చి గెలిపించిన పార్టీ నాయకత్వంపై ప్రత్యర్థులు దాడి చేస్తున్నా మౌనంగా ఎందుకు ఉంటున్నారు..? ఎవరు వాళ్ళు? ఏంటా మ్యూట్ మేటర్? లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి 8 సీట్లు గెల్చుకుంది కాంగ్రెస్ పార్టీ. ఆ ఎన్నికల టైంలో, గెలిచిన కొత్తల్లో తప్ప… తర్వాత ఎప్పుడూ గాంధీభవన్ ముఖం చూసిన…
పార్టీ మారలేదని స్పీకర్‌కు చెప్పి ఆ ఎమ్మెల్యే ప్రత్యర్థులకు పొలిటికల్ టార్గెట్ అయ్యారా? నైతికతను ప్రశ్నిస్తూ నియోజకవర్గంలో చెడుగుడు ఆడేసుకుంటున్నారా? తవ్వకాలు జరిపి మరీ… పాత బైట్స్ వెలికి తీసి సోషల్ మీడియాలో సర్క్యులేషన్స్తో రచ్చ చేస్తున్నారా? ఏ ఎమ్మెల్యే విషయంలో ఆ స్థాయి హంగామా జరుగుతోంది? అక్కడే ఎందుకలా? సార్…. నేను పార్టీ మారలేదు. కాంగ్రెస్‌లోకి ఫిరాయించానన్న మాట అబద్ధం. కావాలంటే చూడండి… నా జీతం నుంచి ఇప్పటికీ నెలనెలా ఐదు వేల రూపాయలు బీఆర్ఎస్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించిన అధికారులకు అభినందనలు తెలిపారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుత ఫలితాలు సాధించిందని.. 2029 లో కూడా ఈ తీర్పు రిపీట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కష్టపడిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు.. ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయన్నారు. ప్రజలు సంపూర్ణ విశ్వాసం ప్రదర్శించారు.. అభినందించారన్నారు. 12702 గ్రామ…
బీహార్‌లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వేదికపై ఓ ముస్లిం వైద్యురాలి హిజాబ్ తొలగించే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో విపక్షాలు, నెటిజన్లు విమర్శల వర్షం కురిపించారు. ఈ వ్యవహారం రాజకీయంగా చాలా దుమారమే చెలరేగింది.
పార్టీ మారినట్లుగా వస్తున్న వార్తలను ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఖండించారు. పార్టీ ఫిరాయింపుపై స్పీకర్ ఇచ్చిన నోటీసులకు వివరణ ఇచ్చారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు లిఖితపూర్వంగా వివరణ ఇచ్చారు.
కాంగ్రెస్ అగ్ర నేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జర్మనీలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా మ్యూనిచ్‌లోని బీఎండబ్ల్యూ ప్లాంట్‌ను రాహుల్ గాంధీ సందర్శించారు. BMW వెల్ట్, BMW ప్లాంట్‌ను గైడెడ్ టూర్లో సందర్శించారు. కార్లు తయారీ, బైకుల తయారీని పరిశీలించారు.
బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తిప్పికొట్టారు. రాష్ట్రంలో ఏం జరిగినా సీఎం రేవంత్‌రెడ్డిపై విమర్శలు చేయడం బీఆర్ఎస్కు అలవాటైపోయిందన్నారు.
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక తీర్పు వెలువరించారు. ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు.