CM Chandrababu : భారత మాజీ ప్రధానమంత్రి, ప్రఖ్యాత ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. ఆయన మరణం దేశానికి అపార లోటని పేర్కొన్నారు. జ్ఞానం, వినయం, సమగ్రతకు ప్రతీకగా నిలిచిన మన్మోహన్ సింగ్ మహా మేధావి, ప్రగాఢ రాజకీయ దూరదృష్టిగల నేతగా కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు, ఆత్మీయులకు గురువారం రాత్రి ‘ఎక్స్’ వేదికగా ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాజీ ప్రధానమంత్రి మరణం పట్ల మంత్రి నారా లోకేశ్ కూడా ‘ఎక్స్’ వేదికగా తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.
Manmohan Singh: 1991 ఆర్థిక సంక్షోభం నుంచి భారతదేశాన్ని మన్మోహన్ సింగ్ ఎలా రక్షించారు..?
పవన్ కల్యాణ్ దిగ్ర్భాంతి
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరణంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు పునాదిరాయిగా నిలిచిన వ్యక్తుల్లో మన్మోహన్ సింగ్ ఒకరని ఆయన పేర్కొన్నారు. ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ఓ ప్రకటనలో తెలిపారు.
Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కి అస్వస్థత.. ఎయిమ్స్‌కి తరలింపు