తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన సమావేశం కొనసాగింది. సుమారు రెండున్నర గంటల పాటు భేటీ జరిగింది. జీహెచ్ఎంసీ మేయర్ పై అవిశ్వాసంతో పాటు పలు రాజకీయపరమైన అంశాలపై చర్చ జరిగింది.
Arekapudi Gandhi: ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంట్లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం ముగిసింది. కౌశిక్ రెడ్డిని తక్షణమే పార్టీ నుండి సస్పెండ్ చేయాలంటూ సమావేశంలో తీర్మానం చేశారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ముగిసింది. ఈ సందర్భంగా అధికారులకు సీఎం కీలక ఆదేశాలు ఇచ్చారు. అన్ని ప్రాజెక్టుల కింద భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ చెల్లింపులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పెండింగ్ బిల్లుల చెల్లింపుకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాకుండా.. పాలమూరు- రంగారెడ్డి తప్పా.. అన్ని ప్రాజెక్టులను 18 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) కౌన్సిల్ 53వ సమావేశం శనివారం ముగిసింది. ఈ సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశానికి సంబంధించిన మినిట్స్‌ను తెలియజేసి కీలక నిర్ణయాలను వెల్లడించారు.
సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ధరణిపై సమీక్ష ముగిసింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, రాజనర్సింహా పాల్గొన్నారు. సుమారు 2 గంటల పాటు ధరణిపై సమీక్షించారు. ఈ క్రమంలో.. ధరణి సమస్యల పరిష్కారానికి కమిటీ వేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. రెవిన్యూ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాల భర్తీపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇదిలా ఉంటే.. నెలకు ఒకసారి మండల కేంద్రంలో రెవిన్యూ సదస్సులు నిర్వహించాలని చర్చించినట్లు సమాచారం. కాగా.. ఎన్నికల్లో…
సెక్రటేరియట్లో విద్యుత్, ఆర్టీసీపై సమీక్ష ముగిసింది. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, కొనుగోలుపై ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. 2014 జూన్ 2 కంటే ముందు పరిస్థితులు, తర్వాత విద్యుత్ ఉత్పత్తి, కొనుగోలు, ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. మరోవైపు.. సీఎండీ ప్రభాకర్ రావు గైర్హాజరు కావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. విద్యుత్, ఆర్టీసీ పై అసెంబ్లీ సమావేశాల తర్వాత మరోసారి రివ్యూ చేస్తానని సీఎం రేవంత్ రేవంత్ తెలిపారు.
సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తొలి కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, సీఎస్ శాంతికుమారి, వివిధ శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు. 6 గ్యారంటీలు సహా పలు కీలక అంశాలపై చర్చించారు. అంతకుముందు ముఖ్యమంత్రిగా సచివాలయంలో రేవంత్ రెడ్డి బాధ్యతలను స్వీకరించారు. సచివాలయంలోకి అడుగుపెట్టగానే ఆయనకు పోలీసులు గౌరవ వందనం…
మంత్రి మల్లారెడ్డి, బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు ముగిసాయి. రెండు రోజుల పాటు 65 బృందాలతో దాదాపు 400 మంది ఐటీ అధికారులతో సోదాలు నిర్వహించారు. ఇప్పటి వరకు రూ.10.50 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు.
విపక్ష సభ్యుల సస్పెన్షన్లు, హాట్ హాట్ డిస్కషన్లు.. వాయిదాల మీద వాయిదాలతో చివరాఖరికి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. ఈ నెల 7న సభా సమావేశాలు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఏపీ వార్షిక బడ్జెట్ 2022-23కి రాష్ట్ర అసెంబ్లీ ఇవాళ ఆమోదం తెలిపింది. అనంతరం, అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. జనరంజక బడ్జెట్ తీసుకువచ్చారంటూ స్పీకర్ రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. సభ్యులు వివిధ ప్రజాసమస్యలు ప్రస్తావించారని,…