Haryana CM: హర్యానా సీఎం వివాదస్పద వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Haryana CM: హర్యానా సీఎం వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరినీ రక్షించడం ప్రభుత్వ యంత్రాంగం వల్ల కాదని అన్నారు. హర్యానాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తీవ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనలపై సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అధికార యంత్రాంగాలు ప్రతి ఒక్కరినీ కాపాడలేవని అన్నారు. రాష్ట్ర పౌరులు సంయమనం పాటించాలని, శాంతిని కాపాడాలని కోరారు. కొన్నిసార్లు సైన్యం, పోలీసులు ఇందుకు హామీ ఇవ్వలేకపోవచ్చని చెప్పారు. హర్యానాలో మతపరమైన ఊరేగింపు సందర్భంగా జరిగిన హింసలో ఇప్పటి వరకు పోలీసులు 116 మందిని అరెస్ట్ చేశారు. మంగళవారం నాటికి మొత్తం 26 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. మత ఘర్షణల్లో ఇద్దరు హోంగార్డులు, ఓ మతాధికారి సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 23 మంది క్షతగాత్రులు కాగా.. వారిలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు సహా పది మంది పోలీసులు ఉన్నారు. హర్యానా అల్లర్లు మంగళవారం రాత్రి గురుగ్రామ్‌ను తాకడంతో తాజాగా ఢిల్లీ అప్రమత్తం అయ్యింది.
Read also: Switzerland: భారతీయులకు షెంజెన్ వీసా దరఖాస్తులు నిలిపివేత
Also Read
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
అల్లర్లలో జరిగిన నష్టానికి పరిహారాన్ని ఎవరిస్తారని మీడియా అడిగిన ప్రశ్నలకు ఖట్టర్ వివాదాస్పదంగా మాట్లాడారు. అల్లర్లకు కారణమైనవారే నష్టాన్నిభర్తీ చేస్తారని అన్నారు. ప్రభుత్వం నష్టాన్నంతటికీ పరిహారాలు ఇవ్వబోదని.. కేవలం నష్టపోయిన ప్రభుత్వ ఆస్తులకు మాత్రమే పరిహారాన్ని కేటాయిస్తామని తెలిపారు. ప్రైవేట్ ఆస్తులకు ప్రభుత్వం జవాబుదారీ కాదని వెల్లడించారు. హర్యానాలో అల్లర్లకు నిరసనగా విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ వంటి సంఘాలు ర్యాలీలు నిర్వహించతలపెట్టిన నేపథ్యంలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్ర ప‍్రభుత్వాలకు సుప్రీంకోర్టు కీలక నోటీసులు జారీ చేసింది. మతపరమైన విద్వేష ప్రసంగాలు చేయకుండా జాగ్రత్తలు పాటించాలని ఆదేశించింది. సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని స్పష్టం చేసింది. సీసీటీవీలతో నిఘాను మరింత పెంచాలని ఆయా ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.
తాజావార్తలు
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!