గుజరాత్ లోశనివారం నాడు అతివేగంగా వెళ్తున్న బస్సు మరో బస్సును ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, మరో 30 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన గుజరాత్ లోని సకారియా బస్ స్టేషన్ సమీపంలో జరిగింది. ఈ ఘటనలో మల్పూర్ నుంచి వస్తున్న స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ బస్సు డివైడర్ ను దూకి మొదాసా నుంచి మల్పూర్ కు వెళ్తున్న మరో బస్సును ఢీకొట్టినట్లు సమీపంలోని ఇంట్లోని సీసీటీవీ ఫుటేజీ రికార్డ్ అయిన వీడియో ద్వారా అర్థమవుతోంది.…