Collectors Conference: సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు, రేపు సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సదస్సు జరగనుంది. ఆరు నెలల ఎన్డీయే ప్రభుత్వ పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, స్వర్ణాంధ్ర ప్రదేశ్ విజన్-2047 డాక్యుమెంట్, కొత్తగా తీసుకొచ్చిన పాలసీల అమలుపై కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ నెల 12 నాటికి ఆరు నెలలు పూర్తి అవనుంది.. దీంతో, రాష్ట్రంలో పాలనను మరింత పరుగులు పెట్టించడానికి సీఎం చంద్రబాబు సిద్దమయ్యారు.. ఇందు కోసం ఈనెల 11, 12 తారీఖుల్లో కలెక్టర్ల సదస్సు జరుపనున్నారు.. సచివాలయంలోని 5 వ బ్లాక్ లోని కలెక్టర్ కాన్ఫురెన్స్ హాల్‌లో సదస్సు నిర్వహించనున్నారు.
మరోసారి.. అంటే ఈ నెల 10, 11 తేదీల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.. కానీ, తాజాగా తేదీలను మార్చేసింది.. ఈ నెల 11, 12 తేదీల్లో రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్టు ప్రకటించింది.
వెలగపూడిలోని సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ సుదీర్ఘంగా కొనసాగింది. 11 గంటల పాటు సమావేశం సాగింది. కలెక్టర్లు, ఎస్పీలకు చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు. కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. అసమర్థ ప్రభుత్వం అనిపించుకోవడానికి తాను సిద్ధంగా లేనన్నారు.
వెలగపూడిలోని సచివాలయంలో కలెక్టర్ల సదస్సు కొనసాగుతోంది. వివిధ సంక్షేమ శాఖలపై ఆయా శాఖల అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సివిల్ సప్లైస్ శాఖ సమీక్ష ప్రారంభించే ముందు కలెక్టర్ల కాన్ఫరెన్సులో ఆసక్తికర సంభాషణ జరిగింది. చాలా దూరంగా కూర్చున్నావ్.. ప్రత్యేకంగా సీటు వేయాలా..? అంటూ ఆ శాఖ కార్యదర్శి సిద్దార్ధ్ జైన్‌ను ఉద్దేశించి సీఎం చంద్రబాబు కామెంట్ చేశారు.
ఏపీ యువతకు గ్లోబల్ స్థాయి ఉద్యోగాలు లభించేలా నైపుణ్యాభివృద్ధి పెంచాలని సీఎం చంద్రబాబు సూచించారు. పాఠశాల, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధిపై కలెక్టర్ల సదస్సులో చర్చించారు. ఆ శాఖ కార్యదర్శులు కోన శశిధర్, సౌరభ్ గౌర్ ఈ సదస్సులో వివరించారు.
రాష్ట్రంలో పోర్టుల నిర్మాణం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం పోర్టుల నిర్మాణాన్ని ఈపీసీ పద్దతుల్లో చేపట్టిందని చంద్రబాబు అన్నారు.పోర్టులను నిర్మించే కంపెనీలకు ప్రభుత్వం గ్యారెంటీలు ఎక్కడ ఇవ్వగలదని ఆయన పేర్కొన్నారు.
గత ప్రభుత్వంలోని ఇసుక అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు. వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఉచిత ఇసుక విధానం, తాగునీటి విషయాల్లో కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు.
కలెక్టర్ట కాన్ఫరెన్స్‌లో వివిధ శాఖల అధికారులకు చురకలు అంటించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కాంతిలాల్ దండేకు క్లాస్ తీసుకున్నారు సీఎం చంద్రబాబు. దండే ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో కొన్ని అంశాలు ప్రస్తావించ లేదన్న సీఎం.. ఏపీలో మొత్తం 12 వేల కిలోమీటర్ల మేర స్టేట్ హైవేస్ ఉంటే.. 1000 కిలో మీటర్ల పీపీపీ ప్రాతిపదికన రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు దండే పేర్కొనడంపై స్పందిస్తూ.. 1000 కిలో మీటర్లు ఏ మూలకు సరిపోవన్నారు చంద్రబాబు.